ఒక్కసారి సినిమాల బరిలో దిగితే.. అయ్యో అన్న ఉన్నాడు కదా..పాపం తమ్ముడొస్తాడు కదా అని ఆలోచించం అంటున్నారు హీరో బ్రదర్స్. తమ్ముడు తమ్ముడే. సినిమాలు సినిమాలే. ఇంట్లో ఉన్నంత వరకే.. అన్నాదమ్ముల అనుబందం అంటున్నారు.ఒకే టైమ్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ.. నువ్వానేనా అనుకుంటున్నరు ఈ స్టార్ బ్రదర్స్.


 
లెక్క లెక్కే. అది అన్న అయినా తమ్ముడు అయినా. రిలీజ్ అంటే రిలీజ్ అంతే. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఆలోచించే ప్రసక్తే లేదు అంటున్నారు స్టార్ బ్రదర్స్. షూటింగ్ డిలే , రిలీజ్ పోస్ట్ పోన్ లతో ఒకే టైమ్ లో సినిమాలు రిలీజ్ చేసుకుంటూ క్లాష్ అవుతున్నారు నాగచైతన్య, అఖిల్. నాగచైతన్య శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.

 

సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఏప్రిల్ 2  న రిలీజ్ చేద్దామనుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో  అఖిల్ , పూజాహెగ్డే చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ అనుకున్నారు. కానీ ఈ రెండుసినిమాలు ఇప్పుడు  మే నెలకు పోస్ట్ పోన్ అయిపోయాయి. ఇలా  ఇంచు మించు ఒకే టైమ్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు అన్నదమ్ములు.

 

మరో స్టార్ బ్రదర్స్ సాయిధరమ్ తేజ్,  వైష్ణవ్ తేజ్ కూడా ఇలాగే క్లాష్ అవుతున్నారు. సుబ్బు డైరెక్షన్లో సాయి ధరమ్ తేజ్ , నభా నటేష్ జంటగా నటిస్తున్నసోలో బ్రతుకే సో బెటరూ మూవీని  మే 1 మేడే రోజు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు టీమ్.  ఇక వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ఏప్రిల్ 2 న రిలీజ్ అవ్వాల్సింది మే 7 కు పోస్ట్ పోన్ చేశారు. జస్ట్ వారం గ్యాప్ లో ధియేటర్లలో  తలపడబోతున్నారు అన్నదమ్ములు.

 

అన్నదమ్ములైన రామ్ చరణ్‌, వరుణ్ తేజ్ కూడా ఇలాగే ఒకే టైమ్ లో సినిమాలు రిలీజ్  చేస్తూ క్లాష్ అవుతున్నారు. రామ్ చరణ్  రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న ట్రిపుల్ ఆర్ జనవరి 8 న రిలీజ్ అవుతోంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఎఫ్ 2 కి సీక్వెల్  ఎఫ్ 3 2021 సంక్రాంతికి రిలీజ్ చేస్తానన్నాడు డైరెక్టర్ అనిల్.

 

ఇలా చూసుకుంటే.. వరుణ్ నటించబోయే ఎఫ్ 3, రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాలు కూడా క్లాష్ అవ్వడం గ్యారంటీ.  ఇంట్లో ఎలా ఉన్నా.. బయట సినిమాల రిలీజ్ లు క్లాష్ అవుతున్నా.. అదే స్పోర్టివ్ స్పిరిట్ తో పోటీ పడుతున్నారు స్టార్ బ్రదర్స్. అంతేమరి ఒకరి కోసం చూసుకుంటే తమ కెరీర్ డైలమా పడడం గ్యారంటీ.. అందుకే రిస్క్ చేస్తున్నారు అంటున్నారు ఆడియన్స్

మరింత సమాచారం తెలుసుకోండి: