ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో అందరూ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రోజు రోజుకు కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండడంతో పలు దేశాల వెన్నులో వణుకు పుడుతోంది. దానితో ఇప్పటికే తమ తమ దేశాల ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేస్తూ దేశాలన్నీ కూడా కొన్నాళ్లపాటు లాకౌట్ ప్రకటించాయి. దానిలో భాగంగా మన దేశాన్ని కూడా మొత్తం 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోడీ, ఈ సమయంలో ప్రజలు ఎవ్వరూ కూడా బయటకు రావద్దని, అలానే ప్రతి ఒక్కరూ కూడా సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటిస్తే రాబోయే అతి కొద్దిరోజుల్లో ఈ మహమ్మారిని మన దేశం నుండి పూర్తిగా తరిమికొట్టవచ్చని పిలుపునివ్వడం జరిగింది. 

 

 

కాగా ఈ లాకౌట్ వలన దేశంలోని వ్యాపారాలు, కంపెనీలు, సంస్థలు, కార్యాలయాలు అన్ని కూడా మూత పడడంతో పలువురు దిగువ వర్గాల ప్రజలు పూర్తిగా సమస్యలతో అల్లాడుతున్నారు. మరికొందరికి అయితే కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి తలెత్తడంతో కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ఆర్ధిక సాయాన్ని ఇప్పటికే ప్రకటించగా, పలు రంగాల ప్రముఖులు కూడా ప్రజలకు ఇటువంటి విపత్కర సమయంలో సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. 

 

ఇకపోతే రేపు, అనగా ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటల నుండి 9 నిమిషాల పాటు ప్రజలు అందరూ కూడా తమ ఇంట్లోని లైట్స్ ఆఫ్ చేసి, చేతిలో కొవ్వొత్తులు, లేదా మొబైల్ ఫోన్ లైట్స్ తో ఎవరికి వారు తమ తమ ఇంటి  బాల్కనీ ముందుకు వచ్చి నిలబడాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరినీ కోరడం జరిగింది. కాగా దీనిపై కాసేపటి క్రితం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ప్రజలను అభ్యర్థిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసారు. ప్రధాని గారు చెప్పినట్లుగా రేపటి లైట్ ఫర్ ఇండియా కార్యక్రమంలో మన అందరం కూడా భాగస్వాములమై మన దేశం నుండి మహమ్మారి కరోనాని తరిమి కొడదాం అంటూ పిలుపునిచ్చారు చరణ్....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: