కరోనా ఎఫెక్ట్ తో  అసలుఫారెన్ లో కూడా ఎక్కడా షూట్స్ చేసే పరిస్తితి లేదు. అయితే సినిమా చేసేప్పుడే కొన్ని ఫారెన్ లొకేషన్స్ లో మాత్రమే ప్లాన్ చేసుకున్న సినిమా వాళ్లకు మాత్రం ఇప్పుడు చెప్పుకోలేని కష్టాలు వచ్చిపడ్డాయి. అసలు ఇంతకీ ఫారెన్ లొకేషన్లలో షూటింగ్ కి వెళ్లే ఛాన్స్ ఎన్నిరోజుల్లో రాబోతోంది..?

 

కరోనా  వైరస్ పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకూ అన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని  వీసాలు రెడీ చేసుకుని  బ్యాగులు ప్యాక్ చేసి పెట్టుకున్న ఫారెన్ షూటింగుల సంగతి అసలు అతా పతా లేదు. కొన్ని సినిమాలు మేజర్ షూటింగ్ పార్ట్స్ ని ఫారెన్ లోనే షెడ్యూల్ చేసుకున్నారు .ఇప్పుడు వాటిని ఎలా ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు ప్రభాస్ అండ్ టీమ్.

 


రెబల్ స్టార్ ప్రస్తుతం రాధాకష్న తో చేస్తున్న జాన్ సినిమా జార్జియాలో షూటింగ్ కోసం వెళ్లింది.  కానీ అక్కడ కరోనా పగ పట్టడందో చేసేదేంలేక తిరిగొచ్చేశారు. మళ్లీ ఇప్పుడప్పుడే జార్జియా వెళ్లే పరిస్తితి కనిపించకపోవడంతో మళ్లీ అంతదూరం ఎందుకు..? ఇక్కడే సెట్లతో పనికానిచ్చేద్దాం అనుకుంటూ సెట్లుడిజైన్ చేసుకుందామని డిసైడ్ అయ్యారట ప్రభాస్ అండ్ యూనిట్.

 

నాగార్జున మూవీ వైల్డ్ డాగ్  కరోనా వైరస్ కు ఎఫెక్ట్ అయ్యింది. క్రైమ్ యాక్షన్  థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ కోసం బ్యాంకాంక్ షెడ్యూల్ ప్లాన్ చేసింది యూనిట్. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ తో బ్యాకాంక్ కి వెళ్ళడం కాదు కదా..కనీసం ఇంటి గుమ్మం దాటడానికి కూడా పర్మిషన్ లేకపోవడంతో ఆ ఫారెన్ షెద్యూల్ పోస్ట్ పోన్ చేసింది. మళ్లీ ఆ షెడ్యూల్ ఎప్పుడన్నది మాత్రం ప్రస్తుతానికి క్వశ్చన్ మార్కే. 
అఖిల్ , పూజాహెగ్డే జంటగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా అమెరికాలో షూటింగ్ జరుపుకుంది. అయితే ఇంకో పార్ట్ అక్కడే షూటింగ్ చెయ్యాల్సి ఉంది. కానీ ప్రజెంట్ ఎక్కడికీ వెళ్లే పరిస్తితి లేదు కాబట్టి.. ఈ ఫారెన్ షె డ్యూల్ ని క్యాన్సిల్ చేసేశాడు డైరెక్టర్ భాస్కర్

 

రామ్ గోపాల్ వర్మ ..  ఎంటర్ ద గర్ల్ డ్రాగన్  మార్షల్ ఆర్ట్స్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇండో చైనీస్ మ్యూచ్యువల్ ప్రొడక్షన్ లో బ్రూస్ లీ కి వీరాభిమాని అయిన ఓ అమ్మాయి బ్యాక్ డ్రాప్ స్టోరీగా వస్తోంది. ఈ సినిమాకు సంబందించి కొన్ని సీన్స్ ని చైనా పరిసర ప్రాంతాల్లో షూట్ చెయ్యాల్సి ఉంది. కానీ .. ప్రస్తుతం చైనాలో  విపరీతంగా ఉన్న కరోనా వైరస్ వల్ల  రెడ్ అలర్ట్ అనౌన్స్ చెయ్యడంతో  మొత్తానికే షూట్ క్యాన్సిల్ చేసుకున్నారు వర్మ అండ్ బ్యాచ్ .

 

కమల్ హాసన్ లీడ్ రోల్ లో వస్తున్న భారతీయుడు  2 కూడా ఈ వైరస్ కి ఎఫెక్ట్ అయ్యింది. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి చైనాలో చాలా లొకేషన్లలో షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ ప్రజెంట్ షూటింగ్ కాదు కదా..అసలు చైనాలో అడుగుపెట్టే పరిస్తితి కూడా లేదు. అందుకే చైనా షెడ్యూల్ని కంప్లీట్ గా ఎత్తేసి వేరే చోట ప్లాన్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు యూనిట్. చైనా కాకుండా ఇండియాలో అయితే పర్వాలేదు.  వేరే చోట.. అంటే ఫారెన్ లోనే చేద్దాం అనుకుంటే మాత్రం సినిమా ఇంకో రెండు సంవత్సరాలు పట్టడం గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడప్పుడే ఫారెన్ లో షూటింగ్స్ చేసే పరిస్తితులు కనిపించడం లేదు కాబట్టి..నో ఫారెన్ షెడ్యూల్స్ అన్నమాట. మరి ఈ సినిమాలు ఆ షూటింగ్ ఎక్కడ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: