స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా శేషా చలం బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇక సినిమా టైటిల్ గా శేషాచలం అని ఫిక్స్ చేశారని అన్నారు. కానీ ఇప్పుడు టైటిల్ గా మరో పేరు వినపడుతుంది. టైటిల్ గా వేట అని పెట్టబోతున్నారట చిత్రయూనిట్. 

 

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అందుకే అదే సెంటిమెంట్ గా రెండు అక్షరాలా టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు వేట ని మించిన టైటిల్ ఉంటుందా చెప్పండి. అందుకే ఆ టైటిల్ కు ఓటు వేశాడట సుకుమార్. బన్ని కూడా ఆ టైటిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమాలో బన్ని మాస్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

 

ఈ సంక్రాంతికి ఆలా వైకుంఠపురములో అంటూ వచ్చి సెన్సేషన్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ వేటతో రికార్డుల వేట కొనసాగించాలని చూస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది. సినిమాలో బన్ని లుక్ కూడా మాస్ గా ఉంటుందని తెలుస్తుంది. అందుకే అల్లు అర్జున్  ఈమధ్య గెడ్డం పెంచుతున్నాడని అంటున్నారు. 

 

రంగస్థలం సినిమాతో సత్తా చాటిన సుకుమార్ అల్లు అర్జున్ తో చేసే ఈ సినిమా కూడా దుమ్ము దులిపెందుకు ప్లాన్ చేశాడు. బన్నితో రష్మిక మొదటిసారి  సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: