దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ 'రౌద్రం రణం రుధిరం'.. ఈ చిత్రంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అనే పేరుతో ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో చరణ్ ని పోలీస్ గా పరిచయం చేసేశాడు దర్శకుడు రాజమౌళి. జస్ట్ నిమిషం నిడివిగల ఈ వీడియోలో గంభీరమైన ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తోడవడంతో చరణ్ రోల్ ని వీర లెవల్లో ఎలివేట్ అయింది. చరణ్ రెండు మూడు గెటప్స్ లో కనిపించనుండగా అందులో ఈ పోలీస్ గెటప్ ఒకటని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రని ఎలా పరిచయం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న స్పెషల్ వీడియో 'రామరాజు ఫర్ భీమ్' రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

రామ్ చరణ్ ని పోలీస్ గా చూపించిన జక్కన్న ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నాడనేది ఇప్పుడు సగటు సినీ అభిమానికి మదిలో ఉన్న ప్రశ్న. ఎన్టీఆర్ ని కూడా ఓ పవర్ ప్రొఫెషనల్ లో చూపిస్తాడా లేక కొమరం భీమ్ ఒరిజినల్ లుక్ లో చూపిస్తాడా అనేది చూడాలి. ఎన్టీఆర్ మూడు గెటప్స్ లో ఆర్.ఆర్.ఆర్ లో కనిపిస్తాడు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఆసక్తి రేపుతోంది. అయితే ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీలో మరో వార్త షికారు చేస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక పాత్రలో 'బందిపోటు దొంగ'లా కనిపించబోతున్నాడట. రామ్ చరణ్ పోలీసుగా కనిపించడంతో ఎన్టీఆర్ బందిపోటుగా కనిపిస్తాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు.  మరి జక్కన్న ఎన్టీఆర్ ని బందిపోటులా పరిచయం చేయబోతున్నాడా..?, ఈ ఊహ బాగున్నప్పటికీ జక్కన్న మదిలో ఏముందో..ఎవరూ ఊహించనిది చేయడమే కదా జక్కన్న స్పెషాలిటీ. ఈ అనుమానాలన్నిటికి మే 20న సమాధానం దొరకనుంది అనుకుంటున్నారు సినీ అభిమానులు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: