షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’ లో హీరోగా పరిచయం అయిన నిఖిలో సోలో హీరోగా తర్వాత సత్తా చాటాలనుకున్నాడు.  కాని సరైన కథలు ఎంచుకునే విసయంలో ఫ్లాప్ అయ్యాడు.  ఇలా రెండు మూడు సినిమాల తర్వాత స్వామిరారా మూవీతో మంచి విజయం అందుకున్నాడు.  ఈ మూవీలో కలర్స్ స్వాతి నటించింది.  ఆ తర్వాత ఇదే కాంబినేషన్ లో ‘కార్తికేయ’ మంచి హిట్ అందుకుంది.  ఇలా వరుసగా సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ,  కేశవ, అర్జున్ సురువరం మూవీస్ తో మంచి విజయాలు అందుకున్నాడు. 

 

చిన్న హీరోగా చిన్న నిర్మాతలకు మంచి వరంగా మారాడు నిఖిల్.  ఆ మద్య ఫ్లాపులతో కాస్త తడబడ్డా అర్జున్ సురువరం మూవీతో కాస్త నిలబడ్డాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం  చందూ మొండేటిదర్శకత్వంలో చేస్తున్నాడు. గతంలో విజయాన్ని సాధించిన 'కార్తికేయ'కి ఇది సీక్వెల్. 'కార్తికేయ 2' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ మూవీ మరో వైజ్ఞానిక విషయంపై అవగాహన కల్పించే విధంగా ఉండబోతుందని అంటున్నారు.  ఇటీవల ఓ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

 

అయితే ఈ మూవీలో నిఖిల్ సరికొత్తగా కనిపిస్తారని అంటున్నారు.  ఈ సినిమాలో నిఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. అందుకోసం ఆయన గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. తన సిక్స్ ప్యాక్ బాడీ ప్రోగ్రెస్ ను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మరో 4 వారాలలో పూర్తి షేప్ ను సాధిస్తానని చెప్పాడు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఇక కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న చందూ మొండేటికి ఈ సీక్వెల్ ఊరటనిస్తుందేమో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: