జబర్దస్త్ ఇపుడు తెలుగింట అతి ప్రధాన వినోదం అయిపోయింది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రతీ గురు,  శుక్రవారాల్లో వచ్చే జబర్దస్త్ షో చూడకుండ ఎవరూ  ఉండలేకపోతున్నారు. మోటు హాస్యమని, బూతుల భాగోతమని విమర్శలు ఉన్నా కూడా జనం ఈ షోకు  బాగా అడిక్ట్ అయిపోయారు. దాంతో ఏ షోకి రాని టీయార్పీ రేటింగ్ దానికి ఉంది.

 

పోటీగా అదిరింది షోను ఇక్కడ నుంచే వెళ్ళిన నాగబాబు, ఇతర జబర్దస్త్ నటులు మరో చానల్లో చేస్తున్నా కూడా ఈటీవీ జబర్దస్త్ కి వచ్చే రేటింగ్ ముందు అది పూర్తిగా తేలిపోయింది. మొత్తానికి జబర్దస్త్ అంటే దానికి అదే సాటి లేదు పోటీగా తయారైంది. ఇవన్నీ ఇలా ఉంటే కరోనా జబర్దస్త్ షోని కూడా మింగేసిందిట.

 

ఎందుకంటే కరోనా వైరస్ వ్యాపించిన నేపధ్యంలో జబర్దస్త్ షోకి  ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త షూటింగులు చేయడం లేదుట. దాంతో ఈ వారం వచ్చినవే లేటెస్ట్ ఎపిసోడ్స్ గా ఉన్నాయి. ఇక వచ్చే వారం నుంచి షోలు పాతవి రిపీట్ చేస్తారట. అంటే పాతవి చూస్తూ కూర్చోవడమన్నమాట.

 

ఇప్పటికే ఇంట్లో లేడీస్ టీవీ సీరియల్స్ లేక గగ్గోలు పెడుతున్నారు. ఇపుడు మగవాళ్ళతో పాటు ఇంటిల్లిపాదీ చూస్తే జబర్దస్ షో ఆగిపోతే మరీ బోర్ అంటున్నారు. కానీ షూటింగులు చేయడం కష్టం కాబట్టి కొన్నాళ్ళు లాక్ డౌన్ పీరియడ్ లో ఇది తప్పదు మరి. ఏది ఏమైనా చుట్టూ  వినోదం తగ్గుతోంది, మరో వైపు  భయం పెరుగుతోంది.

 

దానికి తోడు లాక్ డౌన్ పీరియడ్ పెరిగేలా ఉంది. మొత్తానికి అసలైన రోటీన్ లైఫ్ కి జనం అలవాటు పడాల్సిన టైం వచ్చేసింది. దానికి ప్రతీ వారూ ప్రెపేర్ అయిపోవడమే. అంతవరకూ అంతే సంగతులు. చిత్తగించవలెను.

 

మరింత సమాచారం తెలుసుకోండి: