దిశ పఠాని .. టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. సినిమా పరంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికి ఎందుకనో వసూళ్ళ పరంగా దెబ్బ తీసింది. ఒక వేళ ఈ సినిమా గనక సూపర్ హిట్ అయి ఉంటే టాలీవుడ్ లో దిశా కి వరుసగా అవకాశాలు వచ్చి స్టార్ హీరోయిన్ గా సెటిలయి ఉండేది. కానీ బాలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తూ తన ఖాతాలో హిట్స్ ని వేసుకుంటుంది.

 

వాస్తవంగా చెప్పాలంటే టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే హాట్ హీరోయిన్స్ ఎక్కువగా ఉంటారన్న సంగతి తెలిసందే. బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోతలో గాని హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకోవడం లో గాని ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క అడిషనల్ క్వాలిటీ తోనే ప్రియాంక చోప్రా, రాధిక ఆప్టే లాంటి వాళ్ళు హాలీవుడ్ సినిమాలలోను అవకాశాలు దక్కించుకొని ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఆ జాబితాలో ఉన్న మరో హాట్ బ్యూటి దిశా పటాని. ఈ బ్యూటి బాలీవుడ్ లో ఎంతమంది హాట్ హీరోయిన్స్ ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియోట్ చేసుకుంది.

 

ఇక సినిమాలే కాదు సోషల్ మీడియాలో దిశా తన గ్లార్ ట్రీట్ ఇస్తూ ఫ్యాన్స్ కి కాక్ రేపుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ హాట్ బ్యూటి మనసు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద పడింది. తన సినిమాలని, తన డాన్స్ ని బాగా పొగిడేస్తుంది. అంతేకాదు ఒకవేళ టాలీవుడ్ నిర్మాతలు గనక ఛాన్స్ ఇస్తే అల్లు అర్జున్ సరసన నటించడానికి రెడీగా ఉందట. మొత్తాన్నికి దిశా తన మనసులోని ఆశని బయట పెట్టింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'రాధే' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ కొరియో గ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: