నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "వి". గ్యాంగ్ లీడర్ వంటి ఓ మోస్తారు విజయం తర్వాత నాని చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. పూర్తి కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో నాని నటిస్తున్న మొదటి సినిమాగా చెప్పవచ్చు. ఇంద్రగంటి దర్శకత్వంలో నాని చేస్తున్న మూడవ చిత్రం ఇది. 

 

ఇప్పటికే ఆయన దర్శకత్వంలో నటించిన అష్టా చమ్మా, జెంటిల్ మేన్ చిత్రాలకి మంచి ఫలితమే దక్కింది. అష్టాచమ్మా సినిమా ద్వారానే నాని ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అయితే ఇప్పటి వరకు నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించలేదు. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో కొంతవరకు అలా కనిపించినప్పటికీ మధ్యలో ఆ పాత్ర మారిపోతుంది. మొట్టమొదటిసారిగా వి చిత్రంతో నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు.

 

 

సుధీర్ బాబు రక్షకుడుగా కనిపిస్తుంటే, నాని రాక్షసుడి పాత్రలా ఉంటుందట. ఇప్పటికే టీజర్ రిలీజ్ అయిన ఈ చిత్రం నుండి ఎలాంటి అప్డేట్స్ బయటకి రావట్లేదు. టీజర్ ఆసక్తికరంగా ఉండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. నిజానికి ఉగాది పర్వదినాన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో వి సినిమా రిలీజ్ వాయిదా పడింది. లాక్ డౌన్ పూర్తయితే కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంలో క్లారిటీ రాదు.

 


తాజా సమాచారం ప్రకారం వి సినిమాలోని హీరోయిన్ పాత్ర గురించి బయటకి వచ్చింది.నివేథా థామస్ తో పాటు అదితీ రావ్ హైదరీ నటిస్తున్న ఈ సినిమాలో అదితీ పాత్ర విలన్ లా ఉంటుందట. నానికి సహకరిస్తూ పూర్తి విలనిజాన్ని ప్రదర్శిస్తుందట. లేడీ విలన్ గా కనిపించనున్న అదితీ పాత్ర హైలైట్ గా నిలవనుందట. కరోనా ఎఫెక్ట్ తగ్గితే కానీ తెలియదు వి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: