బాక్సాఫీస్ వ‌ద్ద జూనియ‌ర్ ఎన్టీఆర్‌, బ‌న్నీల మ‌ధ్య పోటీ త‌ప్పేలా లేదు. ఈ ఇద్ద‌రు యంగ్ హీరోల‌తో టాలీవుడ్కు చెందిన ఇద్ద‌రు అగ్ర ద‌ర్శ‌కులైన సుకుమార్‌, త్రివిక్ర‌మ్ సినిమాల‌ను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. సుకుమార్ ముచ్చ‌ట‌గా మూడోసారి బ‌న్నీతో క‌ల‌సి ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జ‌రుగుతుండ‌గా ఇటీవ‌ల క‌రోనా కార‌ణంగా బ్రేకులు ప‌డ్డాయి. ఇక తార‌క్ త‌న 30 సినిమాను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు స్క్రిప్ట్ కూడా సిద్ధ‌మైపోయి జ‌క్క‌న సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే ఇది మొద‌లు కానుంది. 

 

ఈ సినిమాను చినబాబు, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం సమ్మర్‌ను టార్గెట్ చేసుకుని ఈ సినిమా షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు.  అందులో భాగంగా నిర్మాతలు తమ సినిమాను మూవీ ప్రకటన రోజే 2021 ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా విడుదల చేస్తామంటూ చెప్పడం జరిగింది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ ఆర్ ఆర్‌లో బిజిబిజిగా ఉన్నాడు. క‌రోనా త‌ర్వాత ఇది సాధ్య‌మైనంత త్వ‌రగా పూర్తి చేయాల‌న రాజ‌మౌళి భావిస్తున్నార‌ట‌. ఇది పూర్త‌య్యాక వెంట‌నే  త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమాలో న‌టించ‌నున్నాడు. 

 

ఇక బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వాస్త‌వానికి  ఈ సినిమా 2020 చివర్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా వైరస్ కారణంగా మూవీ షూటింగ్ వాయిదా పడింది. మరో నెల వరకు కూడా షూటింగ్ జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో ఏలాగు అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయలేము అని భావించిన చిత్రబృందం నిదానంగా సినిమాను కంప్లీట్ చేసి సమ్మర్ లో విడుదల చేయాలని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఇక అదే జ‌రిగితే బాక్సాఫీస్ వ‌ద్ద  2021 సమ్మర్‌లో  ఎన్టీఆర్, బన్నీల మ‌ధ్య ఫైట్ త‌ప్ప‌ద‌నిపిస్తోంది..

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: