క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు చాచింది. ప్ర‌తి ఒక్క‌రినీ  ద‌హించేస్తుంది. ఈ వ్యాధి ఎంత భ‌యాంత‌క‌ర‌మైనదంటే ఏ మాత్రం శుభ‌త్ర విష‌యంలో కాస్త అజాగ్ర‌త్త‌గా ఉన్నా కూడా వెంట‌నే ఈ వ్యాధి సోకి రోగి మ‌ర‌ణించే ప్ర‌మాదం ఉంది. ఇంత‌టి భ‌యంక‌ర‌మైన వ్యాధి రావ‌డం అనేది ఇదే మొద‌టిసారి అని చెప్పాలి. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఒక్క‌సారిగా భ‌య‌భ్రాంతుల‌తో అల్లాడిపోతున్నారు. ప్ర‌పంచ‌ దేశాలు ఒక్క‌సారిగా లాక్‌డ‌వున్‌కి వెళ్ళిపోయాయి. అంద‌రూ ఎక్క‌డివారు అక్క‌డే ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఈ ఎఫెక్ట్ ఒక్క‌సారిగా సినిమా రంగం పైన ఎక్కువ‌గా ప‌డింది.

 

సినిమాలు షూటింగ్‌లు, ప్రారంభోత్స‌వాలు, సినిమా విడుద‌ల‌లు ఇవ‌న్నీ కూడా మూల‌న ప‌డిపోయాయి. దాంతో తీవ్ర ఆర్దిక ఇబ్బందులు వ‌చ్చిప‌డ్డాయి. ఒక సినిమా నిర్మించ‌డానికి నిర్మాత దానిపైన కొన్ని కోట్లు వెచ్చిస్తుంటారు. సినిమా మీద ప్యాష‌న్‌తో ఉన్న‌డ‌బ్బుల‌న్నీ దానికే పెట్టేస్తుంటారు చాలా మంది నిర్మాత‌లు. ఇక దిల్‌రాజు, సురేష్‌బాబు, అల్లుఅర‌వింద్‌, మైత్రిమూవీస్ లాంటి పెద్ద సంస్థ‌ల‌ను ప‌క్క‌న పెడితే మిగ‌తా నిర్మాత‌లంద‌రూ దాదాపు వాళ్ళ ఆస్తుల‌ను ప‌ణంగా పెట్టి మ‌రీ సినిమా తీస్తారు. కోట్లో జ‌రిగే బిజినెస్‌కి ఎక్క‌డ ఏమాత్రం తేడా వ‌చ్చినా స‌రే తీవ్ర ఇబ్బందులకు గురి అవ్వ‌వ‌ల‌సి ఉంటుంది. ప్ర‌స్తుతం సగం షూటింగ్ అయిపోయి ఆగిపోయిన పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

 

ఒక్కో సినిమాకి కోట్ల‌లో ఖ‌ర్చు పెట్ట‌డం వ‌ల్ల ఒక్కోసారి ఆ డ‌బ్బుల కోసం వారి ఆస్తి కాగితాల‌ను ఫైనాన్షియ‌ర్ల చేతిలో పెట్టిమ‌రీ సినిమాలు తీసేస్తూ ఉంటారు. ప్ర‌స్తుతం అలా ఫైనాన్షియ‌ర్ల చేతిలో చిక్కిపోయిన నిర్మాత‌లు కూడా చాలా మందే ఉన్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ క‌రోనా ఎఫెక్ట్ అనేది సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రినీ కుదిపివేస్తుంది. ఈ ఎఫెక్ట్ అంతా పోయి తిరిగి షూటింగ్‌లు మొద‌లై సినిమాలు విడుద‌లైతే త‌ప్పించి నిర్మాత‌లు మ‌ళ్ళీ సేఫ్‌జోన్‌కి రాలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: