క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ఏ స్థాయిలో వ‌ణికిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 12 లక్షల మందికి కరోనా సోకింది. 64,600 మందికి పైగా మరణించారు. భారత్‌లో సైతం కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 12 గంటల్లో భారత్‌లో 302 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3374కు చేరింది. ఇక కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇక చిత్ర పరిశ్రమలో థియేటర్ల మూసివేయడంతో పాటు షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. ఈ లాక్‌డౌన్ కారణంగా సినీ కార్మికులకు పనిలేకుండా పోయింది. దీంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కార్య‌క‌లాపాల‌న్నీ ఆగిపోవ‌డంతో తీవ్ర ఇబ్బందుల పాల‌వుతున్న కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి చిరంజీవి నేతృత్వంలో విరాళాల సేక‌ర‌ణ మొద‌లుపెట్ట‌డం తెలిసిన సంగ‌తే. క‌రోనా క్రైసిస్ చారిటీ పేరుతో న‌డుపుతున్న ఈ ట్ర‌స్టులో చాలా మంది సినీ ప్ర‌ముఖులు పాల్గొని త‌మ వంతు సాయం చేస్తున్నారు.

 

ఇక  కరోనా క్రైసిస్‌ చారిటీ(సీసీసీ) గుర్తించిన సినీ కార్మికులకు అన్ని అపోలో ఫార్మసీ స్టోర్స్‌లో ఉచిత మందులు అందజేయాలని ఉపాసన నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై చిరంజీవి స్పందించారు. ఉపాసన తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.  ఉపాసనది చాలా మంచి మనసు అని కొనియాడారు. మరోవైపు కరోనాపై ప్రజల్లో అవగాహన కలిగించేలా చిరంజీవి కూడా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఉపాసన రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ విస్తరణలో తనదైన పాత్ర పోషిస్తూన్నారు.సామాజిక కార్యక్రమాల్లో ఉపాసన పాల్గొంటూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: