టాలీవుడ్ లో 90వ దశకంలో నటిగా తన సత్తా చాటింది మీనా.  సిరివెన్నెల మూవీలో బాల నటిగా ప్రవేశించి సీతారామయ్య మనవరాలు మూవీలో హారోయిన్ గా నటించింది.  ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.  వివాహం తర్వాత కొద్ది కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.   ఆ తర్వాత దృశ్యం మూవీతో తెలుగు నాట మళ్లీ కనిపించింది.  సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మీనా ఇప్పడు బుల్లితెరపై కొన్ని ప్రోగ్రామ్ లో జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ తో సతమతమవుతుంది. 

 

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించారు.  దాంతో చిన్నా పెద్ద అందరూ ఇంటనే ఉండి పోయారు.  సామాన్యు ల నుంచి సెలబ్రెటీలు వరకు ఇంటి పట్టున ఉంటున్న విషయం తెలిసిందే.  ఈ రోజు ప్రధాని మోదీ రాత్రి 9 గంటల 9 నిమిషాలకు లైట్స్ క్లోజ్ చేసి దీపాలు వెలిగించాలని చెప్పిన విషయం తెలిసిందే.  తాజాగా నటి మీనా లాక్ డౌన్ గురించి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సినీ ప్రముఖులు పలువురు ఇప్పటికే తమ సందేశాల ద్వారా తెలిపారు.

 

తాజాగా, సినీ నటి మీనా స్పందించింది. మన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించినప్పటికీ కొంతమంది వ్యక్తులు ఇంకా రోడ్లపై తిరుగుతుండటం బాధగా ఉందని పేర్కొంది.  ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి దేశాలు ఇప్పుడు ఎలాంటి  ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో తెలుసా? అని ప్రశ్నించిన మీనా, ఆయా దేశాల్లో ఒక రోజులోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అదే, అమెరికా దేశంలో అయితే రెండున్నర లక్షల మందికి పైగా ఈ వైరస్ తో ఇబ్బందిపడుతున్నారని, ఇలాంటి పరిస్థితి మనకు రావొద్దని అన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: