కరోనా వైరస్ తో దేశం మొత్తం అల్లకల్లోల పరిస్థితుల్లో చిక్కుకుంది. దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. రోజువారీ కూలీలు, కార్మికులు ఎంతో మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. దేశంలోని అన్ని భాషల పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మన తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా పనులు లేక ఆర్ధికంగా ఇబ్బందులకు గురవుతున్న వారి కోసం చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఏర్పాటయింది. దీని ద్వారా పరిశ్రమలో గుర్తింపు కార్డులున్న వారందరికీ సరుకులు అందుతున్నాయి. అయితే గుర్తింపు లేని వారు కూడా ఉన్నారు. వారందరికీ సాయం చేయటానికి జార్జిరెడ్డి సినిమా టీమ్ ముందుకొచ్చింది.

 

 

ఇలా గుర్తింపు కార్డులు లేని వందకు పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించింది. దాదాపు పది రోజులకు సరిపడా నిత్యావసరాలను వారికి అందించి ఈ ఆపత్కాలంలో ఆదుకుంది. నిత్యావసరాల్లో భాగంగా.. బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, నూనె అందించారు. ఈ కార్యక్రమంలో సినిమా హీరో శాండీ పాల్గొని వారికి సాయం అందించారు. ఈ కార్యక్రమాన్ని జార్జిరెడ్డి చిత్ర నిర్మాతలు అన్నపురెడ్డి అప్పిరెడ్డి, దాము రెడ్డితో సహా చిత్ర దర్శకుడు jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి నిర్వహించారు. వీరితో పాటు ఈ సినిమాలో నటించిన పలువురు నటీనటులు కూడా పాల్గొన్నారు.

 

 

సినీ పరిశ్రమ చేస్తున్న సాయానికి తోడు తాము కూడా సాయం అందించాలని భావించామని చిత్ర యూనిట్ ప్రకటించింది. గుర్తింపు లేని వారిని ఆదుకోవాలని తలచి వారిని గుర్తించి ఈ సాయం చేశామని అన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలందరూ ఒక్క తాటిపైకి రావాలని హీరో శాండీ పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలను అందరూ పాటించి సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ ఒకరికొకరు సాయం అందించుకోవడం అవసరమని అన్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: