దేశం మొత్తం కరోనా భయంతో వణికిపోతోంది. ప్రజలందరూ స్వచ్ఛంద జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఆదేశాలు, చెప్తున్న జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో ప్రజలకు తోడునిస్తున్నవి సినిమాలు, పుస్తకాలు, సోషల్ మీడియాలే. దీనిని సినీ సెలబ్రిటీలు విస్తృతంగా ఉపయోగిస్తూ ప్రజలకు తగిన జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు. కొందరు హీరోయిన్లు తమ హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. వీరిలో యూత్ మొత్తాన్ని ఆకర్షించే సెక్సీ బ్యూటీ సన్నీ లియోన్ కూడా ఉంది.

 

 

ప్రస్తుతం కరోనా సమయంలో అందరిలా ఇంటికే పరిమితమైంది సన్నీ. దీంతో తన బోల్డ్ ఫోటోలను ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేస్తోంది. సన్నీని బికినీల్లో ఫోటోషూట్ చేసిన డబూ రత్నాని ఫోటోలను అప్లోడ్ చేస్తోంది. ఈ ఫొటోల్లో సన్నీ బికినీలో చాలా సెక్సీగా ఉంది. ’12 డేస్ ఆఫ్ సమ్మర్’ అంటూ.. లాక్ డౌన్ రోజులు అనే అర్దం వచ్చేలా రాసుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సన్నీ లియోన్. తన బోల్డ్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మానేసింది. రీసెంట్ గా బీచ్ లో గుర్రంపై సెక్సీగా కవ్విస్తున్న సన్నీ ఫోటో పోస్ట్ చేసింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

It's ok to stare!!!😍😘😜 12 days of #Summer . . . Shot by @dabbooratnani @dabbooratnanistudio @manishadratnani #SunnyLeone #LockedUpWithSunny

A post shared by sunny Leone (@sunnyleone) on

 

ఎప్పుడైనా ఫోటోషూట్ చేస్తే తప్ప సన్నీ ఈమధ్య తన ఫ్యామిలీ ఫొటోలు, మంచి డ్రెస్సింగ్ ఫొటోలను మాత్రమే పోస్ట్ చేస్తోంది. కానీ.. ఇప్పుడు సన్నీ తన సెక్సీ పిక్స్ పోస్ట్ చేస్తోంది. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. సన్నీ లియోన్ బికినీ, సెక్సీ అందాలకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ‘ఇన్నాళ్లూ ఏమైపోయావ్’, ‘అసలైన సన్నీ అంటే ఇది’, ‘సన్నీ ఆల్వేస్ హాట్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

12 days of summer !!!!! What’s not to #Love !!!! 😜😍 . . . Shot by @dabbooratnani | @manishadratnani @dabbooratnanistudio #SunnyLeone #LockedUpWithSunny

A post shared by sunny Leone (@sunnyleone) on

మరింత సమాచారం తెలుసుకోండి: