జూనియర్ ఎన్టీయార్ పక్కా మాస్ హీరో. ఇక అల్లు అర్జున్  అయితే చెప్పడానికి ఏముంది. అటు క్లాస్, ఇటు మాస్ రెండూ విరగ్గొట్టే రేంజికి ఎదిగాడు. ఓ విధంగా చెప్పాలంటే మేనమామ చిరంజీవికి సిసలైన వారసుడుగా అన్ని వర్గాల హీరోగా బన్నీ  అయిపోయాడు. లేటెస్ట్ గా అల వైకుంఠపురం హిట్ తో బన్నీ మంచి జోష్ మీద ఉన్నాడు.

 

మరో వైపు జూనియర్ ఎన్టీయార్ తీసుకుంటే అరవింద సమేత హిట్ తరువాత మరో సినిమా చేయడంలేదు. ఆయన ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 8న విడుదల అవుతుంది. ఆ తరువాత సమ్మర్ సీజన్ మీద కన్ను వేశాడు జూనియర్. 

 

దాని కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని లైన్లో పెట్టేశాడు. ఈ ఇద్దరూ కలసి మరోసారి పనిచేస్తున్నారు. ఈ ఇద్దరికీ అరవింద సమేత తరువాత మంచి హిట్ పడాల్సివుంది. దానికి సంబంధించి అన్ని వర్గాలకు నచ్చే మెచ్చే రుచికరమైన  వంటకం తయారు చేసే పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. ఇక జూనియర్ కూడా కసి మీద వరస హిట్లు కొట్టాలని చూస్తున్నాడు.

 

ఈ ఇద్దరూ కలసి చేసే సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు కానీ సమ్మర్ రిలీజ్ అని కర్చీఫ్ వేసేశారు. మరో వైపు చూసుకుంటే సుకుమార్, బన్నీ మూవీ కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్తోంది. ఈ మూవీని కూడా తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ కి రిలీజ్ కొట్టాలని చూస్తున్నారు. అంటే ఓ విధంగా బన్నీ, జూనియర్ ల మధ్య భారీ పోటీకి అపుడే రంగం సిధ్ధమైపోయిందన్న మాట.

 

మూవీ  పట్టాలెక్కలేదు కానీ పోటీ మాత్రం డేట్, టైం, వేదిక సెట్ చేసుకుంది. దీంతో ఇద్దరి ఫ్యాన్స్ లో కొత్త డిబేట్ మొదలైంది. బన్నీ కానీ, జూనియర్ కానీ బ్లాక్ బస్టర్ హిట్లతో ఉన్నారు కాబట్టి మరో హిట్ ఖాయమన్న భావన ఇపుడు వ్యక్తమవుతోంది. చూడాలి వచ్చే సమ్మర్ ఏ విధంగా హీట్ పెంచుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: