ఒక సామాన్యుడు ఎంత గొప్పపని చేసిన గుర్తింపురాదు.. అదే ఒక సెలబ్రిటీ ఏదైనా చిన్నపనిచేసినా.. దాని గురించే మాట్లాడు కుంటారు.. అందులో సినిమా తారల విషయాలంటే అభిమానులు మరింత శ్రద్ధ కనపరుస్తారు.. ఇక నటీనటుల విషయానికి వస్తే వీరు తెరపై కనిపించడం వల్ల, దాదాపు అన్ని రాష్ట్రల్లో, మరి కొందరికైతే విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.. ఒక సినిమా తీసిన నిర్మాతకు కూడా ఇంతగా అభిమానులు ఏర్పడరు.. డైరెక్టర్ పరిస్దితి కొంత నయం..

 

 

ఇక ప్రతి వారికి గుర్తుండేది మాత్రం ఆ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్.. ఇకపోతే అసలు విషయానికి వస్తే కొందరు హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు చాలా అరుదుగా బయటకు వస్తాయి..అలా బయటకు వచ్చిందే పైన కనిపిస్తున్న ఒకప్పటి టాప్, ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో.. అరే ఈ చిన్ని పాప భలే ముద్దుగా ఉంది అనుకునేరు.. ఎందుకంటే, ఆ ఫొటోలో గల పాప ఇప్పుడు సూపర్ స్టార్ గా మారి, సీనియర్ హీరోయిన్ హోదా కూడా అందుకుంది. తెలుగు, తమిళంతో పాటు మరికొన్ని భాషల్లో కలిపి దాదాపు 200 సినిమాల వరకు నటించింది.

 

 

ఇకపోతే 1986 లో వెంకటేష్ హీరోగా వచ్చిన కలియుగ పాండవులు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి.. ఆ తర్వాత తెలుగులోనే కాదు తమిళ తదితర భాషల్లో కలిపి వందల సినిమాల్లో నటించింది. అంతేకాదు, ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంది.. ఇంతగా చెబుతున్న ఆ చిన్నారి ఎవరో చెప్పడం లేదనుకుంటున్నారా..

 

 

హీరోయిన్ మరెవరో కాదు ఖుష్బూ సుందర్. హీరోయిన్లలో తొలిసారిగా ఓ హీరోయిన్‌కు గుడి కట్టేంత అభిమానం సంపాదించుకుని, బొద్దు అందాలతో దశాబ్ధంన్నర పాటు తమిళ ప్రేక్షకులను అలరించింది... ఇక చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో కదా.. ఇలాంటి ఫోటోలు చూస్తే ఖుష్బూ అభిమానులకు పండగే.. 
    

మరింత సమాచారం తెలుసుకోండి: