గత ఏడాది మలయాళం లో సూపర్ హిట్ అయిన చిత్రం లూసిఫర్.. సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ చిత్రాన్ని స్టార్ హీరో పృథ్వీ రాజ్ డైరెక్ట్ చేశాడు. ఈసినిమా తెలుగులో కూడా విడుదలైయింది కానీ మనోళ్లు పట్టించుకోలేదు. ఇక ఇటీవల ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు దాంతో ఈ రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్  హీరోగా నటిస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రీమేక్ పై చిరు స్పందించాడు. లూసిఫర్ రీమేక్ లో నేనే హీరోగా నటిస్తాను కానీ ఇంకా డైరెక్టర్ ను ఫిక్స్ చేయలేదు ఒకవేళ ఈ రీమేక్ ను తమ్ముడు పవన్ చేస్తానంటే తనకు ఇచ్చేస్తానని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో చిరు వెల్లడించాడు.
 
ఇక అలాగే ఆచార్య లో మహేష్ బాబు నటిస్తున్నాడా... చరణ్ నటిస్తున్నాడా అన్న ప్రశ్నకు కూడా చిరు సమాధానమిచ్చాడు. మహేష్ నా బిడ్డ లాంటి వాడు అతనితో నటించడం నాకు ఇష్టమే కానీ ఆచార్య కోసమైతే ఇంతవరకు మహేష్ ను సంప్రదించలేదు. సినిమాలో ఓ  కీలక పాత్ర కు చరణ్ అయితే బాగుంటుందని డైరెక్టర్  కొరటాల శివ అన్నారు అయితే చరణ్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా వున్నాడు. డేట్స్ కుదిరితే చరణ్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ వుందని చిరంజీవి పేర్కొన్నాడు.
 
ఇక ఆచార్య విషయానికి వస్తే ఇటీవలే రెండు కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కి బ్రేక్ పడింది.  సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి, నక్సలైట్ గా నటిస్తుండగా  కాజల్  హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కు విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: