ఒక సినిమా సక్సస్ మీదనే చిత్ర పరిశ్రమలో ఉన్న ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్, డైరెక్టర్ దగ్గర్నుంచి ఆ సినిమా ప్రొడ్యూసర్.. ఆ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులు - నటీనటులు.. ఇలా మొత్తం 24 క్రాఫ్ట్స్ ఆధారపడి ఉంటాయి. ఆ సినిమా హిట్ అయితే వాళ్ళ కెరీర్ కి ప్లస్ అవుతుంది. అందరికి మళ్ళీ సినిమా ఉంటుంది. చేతినిండా పని ఉంటుంది. ముఖ్యంగా అసిసిస్టెంట్స్ కైతే మూడు పూటలా తిండి దొరుకుతుంది. అదే ఆ సినిమా గనక ప్లాప్ అయితే అందరూ రోడ్డున పడాల్సిందే. 

 

ఇక కొన్ని సినిమాలు హిట్టయినా ఆ సినిమాలో నటించిన నటీనటులు పాపులర్ అవరు. కొన్ని సినిమాలు ప్లాప్ అయినా నటీనటులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక రకంగా ఇది లక్ అని చెప్పాల్సిందే. ఇది హీరో హీరోయిన్స్ కి ఎక్కువగా వర్తిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'గద్దలకొండ గణేష్'. మృణాళిని రవి - పుజాహెగ్డే - అధర్వ మురళి ముఖ్య పాత్రలో నటించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని 14రీల్స్ రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాని తమిళ్ లో సూపర్ హిట్ సినిమా 'జిగర్తాండ'కి అఫీషియల్ రీమేక్ గా రూపొందించిన సంగతి తెలిసిందే. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కత్తి మీద సామే. 

 

కథలో లో ఉన్న ఆత్మ ని మన నేటివిటీకి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కించాలి. ఇది చాలా వరకు చేసినప్పటికి కొన్ని సందర్భాలలో సినిమా భారీ హిట్ అవొచ్చు లేదా భారీ ఫ్లాప్ గా కూడా మారవచ్చు. ఈ సినిమా విషయం లో రీమేక్ ల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ సక్సస్ అయ్యాడు. అయితే ఈ సినిమా హీరో వరుణ్ తేజ్ కి - స్పెషల్ రోల్ చేసిన పూజాహెడ్గేకి మాత్రమే ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.

 

కానీ ఎన్నో ఆశలతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన హీరోయిన్ మృణాళినికి మాత్రం ఈ సినిమా ఏమాత్రం ఉపయోగపడింది లేదు. ఈ సినిమాలో నటన పరంగా మంచి మార్కులే సంపాదించుకున్నప్పటికి తను ఆశించినంతగా తెలుగులో అవకాశాలు రాలేదు. పేరుకే స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ అయినప్పటికి ఈ అమ్మడికి మాత్రం టాలీవుడ్ లో పిలిచి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు లేకపోవడం ఆశ్చర్యకరం.    

మరింత సమాచారం తెలుసుకోండి: