యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లు కలిసి ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా గా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత చరణ్ ఇద్దరు ముగ్గు డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టుకున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

 

సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కమర్షియల్ సక్సస్ ని సాధించింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కి కూడా ఈసినిమా గొప్ప పేరుని తెచ్చి పెట్టింది. మొదటి నుంచి కాపీ కథ అంటున్నప్పటికి అల రిలీజయ్యాక ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. 

 

ఇక త్రివిక్రమ్ మరోసారి తన తర్వాతి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్నారు. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'అయినను పోయిరావలె.. హస్తినకు' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసి లుక్ ని రిలీజ్ చేశారు కూడా. ఈ సినిమా తారక్ కి 30 వ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం. అయితే రష్మిక మందన్న నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 

ఇక అల వైకుంఠపురము లో సినిమాకి ముందు ఎన్టీఆర్ పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ కమర్షియల్ హిట్ ను సాధించింది. ఫ్యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని చూపించిన విధానం సినిమాకే హైలెట్ గా నిలిచింది. అందుకే మరోసారి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే మరోసారి ఇలాంటి పవర్ ఫుల్ సినిమా అనే అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమాకి కొనసాగింపు అని అనుకుంటున్నారు కూడా.

 

కాని తాజా సమాచారం ప్రకారం 'అయినను పోయిరావలె.. హస్తినకు' సినిమా కంప్లీట్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తుంది. అరవింద సమేత కి 'అయినను పోయిరావలె.. హస్తినకు' సినిమాకి అసలు సంబంధం లేదని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ చాలా జోవియల్ గా చూపించబోతున్నారట. అయితే ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో తో ఇలాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్ వర్కౌట్ అవుతుందా అదీ "ఆర్ ఆర్ ఆర్" తర్వాత అని తారక్ ఫ్యాన్స్ సందేహాలని వ్యక్తపరుస్తున్నారట.    

మరింత సమాచారం తెలుసుకోండి: