ప్రపంచ వ్యాప్తంగా వినపడే మాట మహమ్మారి కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి..దేశంలో కరోనా నియంత్రణలు ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతున్నారు. 

 

 

ప్రజల శ్రేయస్సు లో భాగంగా లాక్ డౌన్ ను విధించింది. మార్చి 22 నుంచి  ప్రారంభమైన ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది. 

 

 


ఇకపోతే కరోనా నుంచి మనల్ని మనం ఎలా  కాపాడుకోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జాగ్రత్తలు తెలిపిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కరోనా పై జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. అదే రచ్చ చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా  వారికి సపోర్ట్ చేస్తున్నారు.ఈ మేరకు  ఏప్రిల్ 5 న విద్యుత్ దీపాలతో కరొనను పారద్రోలాలని మోడీ పిలునిచ్చారు. 

 

 


ప్రతి ఒక్కరూ లైట్లు ఆర్పి, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశాన్ని నెరవేర్చారు.ఈ సాయంత్రం నుంచే ఇళ్లలో సన్నాహాలు మొదలుపెట్టిన ప్రజలు, సరిగ్గా 9 గంటలు కాగానే లైట్లు ఆర్పి దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి ఆ వెలుగులతో భారతీయతను సగర్వంగా చాటారు.ఈ క్రతువులో ప్రముఖులు సైతం విశేషంగా పాలుపంచుకుని స్ఫూర్తిని ప్రదర్శించారు. మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి మోదీ పిలుపును ఆచరించారు. మహేశ్ బాబు, రజనీకాంత్, మోహన్ బాబు, వెంకటేశ్, తమన్నా తదితరులు దీపాలు, కొవ్వొత్తుల చేతబట్టి దేశభక్తిని చాటారు. అటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అర్ధాంగి అనుష్కతో కలిసి దీపాలు ప్రజ్వలింపచేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: