టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తొలితరం సూపర్ స్టార్ గా ఎన్నో ఏళ్లపాటు వెలుగొందిన విశ్వవిఖ్యాత నరసార్వభౌమా అన్న ఎన్టీఆర్ గారు, తెలుగు ప్రజల గుండెల్లో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ కూడా మన దేశం సహా పలు ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం అన్న గారి గొప్పతనాన్ని ఎప్పటికీ మరిచిపోలేం అని చెప్తూ ఉంటారు అంటే ఎన్టీఆర్ గారి చరిష్మా ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఆ తరువాత తరంలో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ కూడా దాదాపుగా ఆ విధంగానే గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇక ఆపై వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా రంగాన్ని తన అత్యద్భుత నటన, డ్యాన్స్ లతో ఒక ఊపారనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే అప్పట్లో అన్నగారి ప్రభంజనాన్ని మళ్ళి టాలీవుడ్ కి పరిచయం చేసింది మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. 

 

ఇక వారి తరం అనంతరం వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ కూడా తమ కెరీర్ లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇద్దరూ ఎవరికి వారు ప్రత్యేకంగా విశేషమైన ప్రజాదరణను, ఫ్యాన్ ఫాలోయింగ్ ని అలానే విపరీతమైన క్రేజ్ ని సంపాదించడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మెగాస్టార్ తరువాత ప్రస్తుతం కొనసాగుతున్న నెంబర్ వన్ హీరోలు ఎవరు అంటే మెజారిటి ప్రేక్షకుల నుండి వీరిద్దరి పేర్లు వినపడతాయి అంటే వారి చరిష్మా ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇటీవల కొన్నాళ్లుగా మాత్రం అటు పవన్, ఇటు మహేష్ పై కొందరు దర్శకులు కొద్దిపాటి నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

 

వాస్తవానికి ప్రతి ఒక్క దర్శకుడికి కూడా వారిద్దరితో కనీసం ఒక్క సినిమా అయినా చేస్తే చాలని ఉంటుందని, అయితే ఇక్కడ వచ్చిన తలనొప్పల్లా ఏంటంటే, వారిద్దరితో సినిమా చేయాలంటే ఎన్నో లెక్కలు వేసుకుని స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవడంతో పాటు కథ, కథనాల్లో ఏ మాత్రం లోపం లేకుండా ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలని, ఎందుకంటే ఈ ఇద్దరికీ ఎంత గొప్ప క్రేజ్ ఉందో, అదే విధంగా వీరు నటించే సినిమాలు ఏమాత్రం వారి వారి అభిమానులకు నచ్చకపోయినా అవి ఘోరంగా పరాజయం పాలయిన సందర్భాలు అనేకం ఉన్నాయని, కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకుని ఎవరైనా దర్శకులు వారి అభిమానులను, అలానే ప్రేక్షకులను పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టుకుని మంచి స్క్రిప్ట్ సిద్ధం చేస్తే మాత్రం ఆ సినిమాలు సెన్సేషనల్ హిట్ కావడం గ్యారెంటీ అని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: