టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి రెండేళ్ల క్రితం తన కెరీర్ సిల్వర్ జూబిలీ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి తరువాత సినిమాలకు కొంత విరామం ఇచ్చిన పవన్, ఆపై తన జనసేన పార్టీ తరపున మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తరపున పోటీ చేయడం జరిగింది. అయితే అప్పటి నుండి పవన్ మళ్ళి సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుతుండడంతో, ఎట్టకేలకు వారి అభ్యర్ధనను ఆలకించిన పవన్, వకీల్ సాబ్ ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. 

 

దాని తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమాని పవన్ చేయనున్నారు. ముందుగా వకీల్ సాబ్ సినిమా రాబోయే జూన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇకపోతే ఎంత వయసు పెరిగినప్పటికీ కూడా ఇప్పటికీ అదేవిధమైన ఫిజిక్ ని మెయింటెయిన్ చేసే అలవాటున్న పవన్ కళ్యాణ్, ఇటీవల రాజకీయాల్లోకి వెళ్ళాక కొంత మారినట్లు అర్ధం అవుతుంది. అయితే మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడంతో ప్రస్తుతం ఆయన తన ఫిజిక్ పై బాగానే దృష్టిపెట్టినట్లు సమాచారం. 

IHG

 

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే, కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యణ్ నటించిన తొలిప్రేమ సినిమాలో ఆయన క్రికెట్ ఆడే ఒక సన్నివేశంలో దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోని పలు విధాలుగా షేర్స్, లైక్స్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్, కాలం మారినా పవర్ స్టార్ పవర్ ఏ మాత్రం తగ్గదని, టైం మారింది అంతే, ఆయన టైమింగ్ లో కాదని, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ ఫొటోలో మాదిరిగా మరికొద్దిరోజుల్లో పవన్ మళ్ళి అదేవిధమైన స్టైల్ తో తమని సినిమాల ద్వారా అలరిస్తారని పలువురు పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: