అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవర కొండ..; గీత గోవిందం సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు ఈ సినిమా తర్వాత ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం క్రాంతి మాధవన్ సినిమాలో దర్శకత్వంలో వరల్డ్ ఫెమస్ లవర్ .. తెరకెక్కుతుంది. దీంతో ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. 

 

 

 


హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన  వరల్డ్ ఫేమస్ లవర్ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే..  సినిమా తరువాత అయన పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేయనున్నాడు. ఇప్పటికే విజయ్  పూరి ల ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొనడమే కాకుండా దీన్ని పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దే సన్నాహాలు చేస్తుండడంతో ఈ అంచనాలు భారీగా పెరిగాయి.

 

 

 

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి 'ఫైటర్' .. 'లైగర్' అనే టైటిల్స్ ను పరిశిలీస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ కి తగినట్టుగా విజయ్ దేవరకొండ మంచి ఫిట్ నెస్ తో కనిపించవలసి వుంది. అందువలన ఆయన జిమ్ లో గట్టి కసరత్తులు చేస్తూ వస్తున్నాడు.

 

 

 

అయితే కరోనా కారణంగా విధించిన కర్ఫ్యూ కారణంగా జిమ్ లు కూడా మూతబడిపోయాయి. ఒకవేళ అందుబాటులో వున్నా, ప్రస్తుతం వాటిని ఉపయోగించలేని పరిస్థితి. చాలామంది హీరోలు తమ ఇంట్లోనే జిమ్ ను ఏర్పాటు చేసుకుంటారు. కానీ విజయ్ ఇంకా తన ఇంట్లో జిమ్ సెట్ చేసుకోలేదు. అందువలన వర్కౌట్స్ చేసే విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడట. లాక్ డౌన్ కారణంగా జిమ్ లు క్లోజ్.. ఇప్పుడు జిమ్ కోసం కష్టపడుతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: