స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2020 ప్రారంభం లోనే 'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ ని అందుకున్నాడు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాగా రికార్డ్ ని క్రియోట్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటి పడి ఇలా రికార్డ్ చేయడం అంటే చాలా గొప్ప విషయం అని బన్నీ ఫ్యాన్స్ గ్రేట్ గా ఫీలయ్యారు. ఇక బన్నీ ఇప్పటి వరకు కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు భారీ డిజాస్టర్స్ వదులుకున్నాడు. ఆ సినిమాల లిస్ట్ చూస్తే షాకవడం ఖాయం.

 

బన్నీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే వాస్తవంగా ఈ సినిమా కంటే ముందే దర్శకుడు తేజ బన్నీకి జయం కథ చెప్పాడు...కానీ గంగోత్రి రిలీజ్ సమయం కావడంతో జయం సినిమాను పెద్దగా పట్టించుకోలేదట. ఆ సినిమాలో నితిన్  ఛాన్స్ కొట్టేసి బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బోయపాటి శ్రీను ఫస్ట్ సినిమా భద్ర కూడా బన్నీనే చేయాల్సింది. కానీ ఆ సినిమాలో రవితేజ నటించి మాస్ హిట్ ని అందుకున్నాడు. లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన 100% లవ్ కూడా బన్నీ చేయాల్సి ఉంది. ఆ అదృష్ఠం నాగ చైతన్యకు దక్కింది.

 

ఇవే కాదు గోపిచంద్ మలినేని తీసిన ‘పండగ చేస్కో’ సినిమాలో ముందు బన్నీ ఒప్పుకున్నాడు. కాని తర్వాత డ్రాపయ్యాడు. ఒక లైలాకోసం, అర్జున్ రెడ్డి, గ్యాంగ్ లీడర్, డిస్కో రాజా, గీతా గోవిందం, అరవింద సమేత ... ఈ సినిమాలన్ని అల్లు అర్జున్ చేతిలో నుండి జారిపోయినవే. వీటిలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. డిస్కోరాజా, గ్యాంగ్ లీడర్ లాంటి రెండు మూడు సినిమాలు తప్ప. ఇన్ని సినిమాలు మిస్సయినా కూడా బన్ని ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగుతున్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో హ్యాట్రిక్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో సినిమాకి బ్రేక్ ఇచ్చారు. 


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: