యువ హీరో నిఖిల్ లాస్ట్ ఇయర్ అర్జున్ సురవరం సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2 తో పాటుగా సుకుమార్ నిర్మాతగా కుమారి 21f  డైరెక్టర్ సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో నిఖిల్ వాటి కోసం వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఇక ఇన్నాళ్లు ఆన్ స్క్రీన్ లో లవ్ స్టోరీస్ చేసిన నిఖిల్ తన రియల్ లైఫ్ లో కూడా లలవ్ స్టోరీ నడిపించాడు. 

 

ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఆంధ్రాలో డాక్టర్ గా చేస్తున్న పల్లవి వర్మ పరిచయం ఏర్పడిందట. ఇద్దరిది కేవలం వన్ ఇయర్ పరిచయమే కాని ఆమె అభిరుచులు నచ్చడంతో తనకు తెలియకుండానే ఆమెను ఇష్టపడ్డాను అంటున్నాడు నిఖిల్. ఒకరోజు ఆమెకు తన లవ్ ప్రపోజల్ చేస్తే తను కూడా ఒప్పుకుందని.. ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకోవడంతో లవ్ కమ్ ఎరేంజెడ్ మ్యారేజ్ అవుతుందని అన్నాడు నిఖిల్. రీసెంట్ గా పల్లవి వర్మతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు నిఖిల్. ఏప్రిల్ 16న మ్యారేజ్ ఉండాల్సింది. 

 

కరోనా లాక్ డౌన్ వల్ల నిఖిల్ కూడా తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడని తెలుస్తుంది. డాక్టర్ తో లవ్ మ్యారేజ్ నిఖిల్ కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాడు. డాక్టర్ యాక్టర్ కాంబినేషన్ అదిరిపోతుంది. మరి పల్లవి ఎంట్రీ తో నిఖిల్ లైఫ్ లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. కచ్చితంగా నిఖిల్ రాబోయే రెండు సినిమాలతో సెన్సేషన్ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. కార్తికేయ 2 కోసం ప్రస్తుతం సిక్స్ ప్యాక్ చేసే పనిలో ఉన్నాడు నిఖిల్. కుర్రాడి స్పీడ్  చూస్తుంటే ఇక నుండి అదరగొట్టేలా ఉన్నాడు. కార్తికేయ 2 కాన్సెప్ట్ టీజర్ ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు పెంచింది. సినిమా తప్పకుండా మరోసారి దర్శకుడు చందు మొండేటి సత్తా చాటుతుందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: