అప్పట్లో ఆ సీరియల్ కోసం ఎంత ఎదురుచూసేవారో ఇప్పుడూ అంతగానే వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. రామాయణం , మహాభారతం ..ఈ  సీరియల్స్ అప్పటి వరకూ ఉన్న టెలివిజన్ రేటింగ్స్ మార్చేసి , అంతకుముందు దేనికీ లేనంత పాపులారిటీ తెచ్చిపెట్టాయి.అరచేతిలో ఎన్నో రకాల ఎంటర్ టైన్ మెంట్ యాప్స్  ఉండగా ఈ సీరియల్ ఎవరు చూస్తారు అనుకున్న వాళ్లకి దిమ్మతిరిగిపోయే రేటింగ్స్ తో .. స్వీట్ షాకిచ్చాయి ఈ క్లాసిక్ సీరియల్స్. 

 

30 ఏళ్ల క్రితం మరుగున పడిపోయిన సీరియల్స్ ని మళ్లీ ఎవరు చూస్తారు ..? అసలు ఈ ఐడియా వర్కవుట్ అవుతుందా అని ఆలోచించి ఒకడుగు వేశారో లేదో.. ప్రేక్షకుల నుంచి  అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. అప్పటి జనరేషన్ కి ఎన్నో మెమరీస్, ఎమోషన్స్ తో అటాచ్ అయిన ఈ సీరియల్స్  మళ్లీ అప్పటి అనుభవాల్ని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే  చాలా మంది సెలబ్రిటీలు ఆనాటి మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.  అందుకే  రీటెలికాస్ట్ చేస్తున్న సీరియల్ కూడా ఇంత పెద్ద హిట్ అయ్యింది.

 

ఇండియన్ టెలివిజన్ చరిత్రలో నిలిచిన మోస్ట్ క్లాసికల్ ఐకానిక్ సీరియల్ రామయణం రీ టెలికాస్ట్ అవుతుందటే అందరూ అదే పనిగా టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు .  ఇండియన్ టెలివిజన్ చరిత్రలో హిందీ జనరల్ ఎంటర్ టైన్ మెంట్ స్పేస్ లో  ఇప్పటివరకూ ఎక్కువమంది చూసిన సీరియల్  రీ టెలికాస్ట్ అవుతున్న రామాయణమే. మార్చి 28 నుంచి మొదలైన ఈ రామానంద్ సాగర్ రామాయణాన్ని అక్షరాలా కోటి 70లక్షల మంది చూసినట్టు అఫీషియల్ గా బార్క్ అనౌన్స్ చేసింది.  

 

రామాయణంతో పాటు అద్భుత మైన విజువల్ వండర్స్ అయిన అప్పటి మరో డివోషనల్ సీరియల్  మహాభారత్  తో పాటు అన్ని జానర్స్ వాళ్లను ఎంటర్ టైన్ చేసేలా సర్కస్, బ్యోమకేష్ భక్షి సీరియల్స్ ని కూడా రీ టెలికాస్ట్ చేస్తున్నారు. వీటికి కూడా మంచి రెస్పాన్స్ అందుతోంది.  ఈ లిస్ట్ లోకి ఇప్పుడు ఇండియాన్ సూపర్ హీరో అయిన శక్తిమాన్ కూడా యాడ్ అవుతున్నాడు. ఎంతైనా అప్పుడూ ఇప్పుడూ మన ఆడియన్స్ ఏం మారలేదు ..కంటెంట్ ఉన్నదాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు .

 

మరింత సమాచారం తెలుసుకోండి: