ఎలాంటి విషయాన్నైనా ప్రపంచం మొత్తం ఒకలా ఆలోచిస్తే తాను మాత్రం మరోలా ఆలోచించడం అది ఒక్క ఆర్జీవికి మాత్రమే చెల్లుతుంది. అతను పనులు.. చేసే కామెంట్స్.. తీసే సినిమాలు ఇవన్నీ అతన్ని అభిమానించే వారికి తప్ప మిగతా వారికి నచ్చనే నచ్చవు. ఒకరి మెప్పు కోసం నేను ఏ పని చేయను అని చెప్పే వర్మ నా సినిమా చూడమని నేనేమి బలవంతం చేయట్లేదు మీకు ఇష్టం ఉంటేనే చూడండి లేదంటే వదిలేయండి అంటాడు. 

 

ఇక ప్రస్తుతం కరోనా మీద వర్మ తన పగ తీర్చుకుంటున్నాడు. ఇప్పటికే ఒక సాంగ్ రాసి పాడిన ఆర్జీవీ ఆదివారం ప్రధాని పిలుపు మేరకు రాత్రి 9 గంటలు 9 నిమిషాలు దీప జ్యోతులు వెలిగించమంటే.. దేశ ప్రజలంతా ఆయన సందేశం మేరకు దీపాలు, ఫ్లాష్ లైట్లు, క్యాండిల్స్ వెలిగించారు. అయితే వర్మ మాత్రం వెరైటీగా సిగరెట్ వెలిగించాడు. అదేంటి అనుకోవచ్చు. ప్రతి దాన్ని కాంట్రవర్సి చేయడం ఆర్జీవికి అలవాటే. అందరితో పాటుగా తాను కూడా ఏ క్యాండిల్ కానీ ఫ్లాష్ లైట్ కానీ వెలిగిస్తే ఎలా అనుకున్నాడో ఏమో ఏకంగా సిగరెట్ వెలిగించాడు. 

 

అంతేకాదు ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు వర్మ.. సిగరెట్ తాగడంపై ప్రభుత్వ హెచ్చరికను పాటించకపోవడం కన్నా కరోనా గురించి ప్రభుత్వ హెచ్చరిలకు పాటించకపోవడం చాలా ప్రమాదకరమని అన్నారు. తను చెప్పే ఏ విషయాన్నైనా డబుల్ మీనింగ్ తో చెప్పే వర్మ దీపాల వెలిగించడం లో కూడా సిగరెట్ తో లింక్ పెట్టి ప్రజల మీద సెటైర్ వేశాడు. అయితే వర్మ ఇలాంటి పనేదో చేస్తాడని ముందే ఊహించిన ప్రేక్షకులు ఆయన రియాక్షన్ కు పెద్దగా షాక్ అవ్వలేదు. తను చేసే సినిమాల కన్నా వర్మ ఇలా బయట విషయాల మీద తన మార్క్ సెటైర్స్ వేస్తూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న్నాడు. అయితే ప్రేక్షకుల్లో కొందరైతే అతన్ని పట్టించుకోవడం కూడా మానేశారని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: