కరోనా వైరస్ సృష్టిస్తున్న భీభత్సాన్ని ఆపడానికి దేశమంతా లాక్ డౌన్ విధించబడిండి. ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉన్న దేశాలే కుదేలైపోతుంటే భారత్ తన శక్తి మేరకు కరోనాపై పోరాడుతుంది. అత్యధిక జనాభా ఉన్న మనలాంటి దేశంలో కరోనాని ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ఒక్కటే మేలని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం కూడా. అయితే ఈ సమయంలో సెలెబ్రిటీలు అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు.

 

 

సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశ్యంతో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకి దగ్గర అవుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్  మీడియాలో అకౌంట్ ని స్టార్ట్ చేశారు. ఎప్పటికప్పుడూ ట్విట్టర్ లో చాలా ఆక్టివ్ గా ఉంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా రోజువారి సీనీ కార్మికుల పనులన్నీ ఆగిపోవడంతో వారికి సాయం చేయడానికి కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

 

లాక్ డౌన్ టైమ్ లో మెగాస్టార్ తన దినచర్యని బయటపెట్టాడు. చాలాకాలంగా తాను చేయాలనుకుంటున్న పనికి ఈ లాక్ డౌన్ ఒక అవకాశంగా దొరికిందట. అందుకని చిరంజీవి ఆత్మకథ రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడట. అసలే బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. చిరంజీవి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చి హీరోలయినా వారెందరో ఉన్నారు. 

 

అయితే ఆ స్ఫూర్తిని మనలో కలిగించడానికి చిరంజీవి సిద్ధమయ్యాడట. పుస్తకరూపంతో పాటు వీడియో రూపంలో ఆవిష్కరించబోతున్న ఆత్మకథని రోజూ కొద్ది కొద్దిగా రాస్తున్నాడట. అంతేకాదు ఈ లాక్ డౌన్ సమయంలోకిచెన్ లో దూరి దోసలు వేస్తున్నాడట. మొక్కలకి నీళ్ళు పోయడం..పాత సినిమాలు చూడటం కాలక్షేపంగా లాక్ డౌన్ ని గడుపుతున్నాడట. ఈ ఆత్మకథ పుస్తకరూపంతో పాటు వీడియో రూపంలోనూ ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: