పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అని కాస్త టైం కేటాయించాడో లేదో.. ఈ కరోనా వచ్చి షూటింగ్ లు అన్నీ వాయిదా పడేలా చేసింది.. ఈ కరోనా వైరస్ విజృంభణ చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.. అంతేకాదు.. ఇప్పుడు పడిన ఆర్ధిక దెబ్బ వల్ల ఏకంగా 18 నెలలు కోలుకోలేని స్థితి.. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలకు పెద్ద లోటు లేదు అనుకోండి. 

 

IHG

 

ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా అతని క్రేజ్ కి సినిమాలు చూస్తారు అనుకోండి.. ఫ్యాన్స్ కూడా పవన్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.. ఇంకా ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఓ సూపర్ అప్డేట్ వచ్చింది. అది ఏంటి అంటే పవర్​స్టార్​ పవన్‌కల్యాణ్ కథానాయకుడుగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.

 

IHG

 

ఈ సినిమాలో ఓ తెలుగు అమ్మాయి ఐటెం సాంగ్ చేయనున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. లాక్ డౌన్ కారణంగా అందరూ ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైనా ఈ గుసగుసలు తగ్గటం లేదు అంటే నమ్మండి.. అయితే ఆ అమ్మాయి ఎవరు అని అనుకుంటున్నారా? పూజిత పొన్నాడ అండి.. అయితే పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే కదా! 

 

IHG

 

అలానే క్రిష్-పవన్ సినిమాలోనూ ఐటమ్​సాంగ్​ పెట్టి అభిమానుల‌ను అల‌రించాల‌ని మూవీ యూనిట్ ఆలోచిస్తుంది. కాగా పూజిత పొన్నాడ‌.. నారా రోహిత్‌ స‌ర‌స‌న‌ 'తుంటరి' సినిమాలో న‌టించి వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'రంగస్థలం', 'కల్కి' చిత్రాల్లోను ఓసారి మెరిసింది. మరి ఈ గుస గుసల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ స్పందించే వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: