చిరంజీవి వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ వీలైనంత వరకు తన వైపు నుండి ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో నిన్న ఒకప్రముఖ దినపత్రికకు చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండు విషయాల పై చాల తెలివిగా స్పందించాడు.


మొదటిగా తన కొడుకు చరణ్ మళయాళ మూవీ ‘లూసి ఫర్’ ను తెలుగులో రీమేక్ చేయడానికి ఆమూవీ రైట్స్ కొన్న విషయాన్ని వివరిస్తూ వాస్తవానికి ఈ మూవీని చరణ్ పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని కొన్నాడు అన్నక్లారిటీ ఇచ్చాడు. అయితే ఈమూవీ తనకు బాగా నచ్చడంతో తాను ఆ మూవీ రీమేక్ లో నటిస్తున్నానని ఒకవేళ ఆ మూవీ కథ తనకు కావాలి అని పవన్ అడిగితే తాను పవన్ కోసం ఈ మూవీని వదులుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. 


దీనితో ‘లూసీ ఫర్’ మూవీలో పవన్ నటిస్తాడు అని ఆశ పడుతున్న పవన్ అభిమానుల ఆశల పై చిరంజీవి పరోక్షంగా నీళ్ళు జల్లాడు. ఇదే ఇంటర్వ్యూలో చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో మహేష్ నటించే విషయంలో కూడ చాల విభిన్నంగా స్పందించాడు. తనకు మహేష్ కొడుకుతో సమానమని నిజంగా మహేష్ తో నటించే అవకాశం వస్తే తనకన్నా ఆనందించేవాడు మరెవ్వరు ఉండరు అంటూ మహేష్ అభిమానులకు అసంతృప్తి కలగకుండా చిరంజీవి వ్యూహాత్మకంగా కామెంట్ చేసాడు.

ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ ‘ఆచార్య’ మూవీలో రెండవ హీరో పాత్రను తాను కొరటాల చరణ్ ను ఆలోచించి క్రియేట్ చేసాము కాని మహేష్ ను ఆలోచించి కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తన భార్య సురేఖ కు తాను చరణ్ లు కలిసి ఒక మూవీలో పూర్తిగా ఫుల్ లెంగ్త్ పాత్రలలో కలిసి నటిస్తే చూడాలని తన భార్య సురేఖ కోరిక అని చెపుతూ ఒకవైపు పవన్ అభిమానులను మరొక వైపు మహేష్ అభిమానులను బ్యాలెన్స్ చేస్తూ చిరంజీవి చేసిన కామెంట్స్ అతడి సమయస్పూర్తిని సూచిస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: