కొద్దీ రోజులు రాజకీయాలను కాస్త పక్కన పెట్టి సినిమాలు చేస్తున్నాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మాములుగా ఆయనకీ సినిమాలకి ఉండే క్రేజ్ మాములుగా లేదు.  దింతో ఇప్పుడు చాలా మంది దర్శకులు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ అనే సినిమాలో హిందీ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి దాదాపుగా పూర్తి అయిందని అనుకోవచ్చు. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా వైరస్ కారణంగా చిత్ర యూనిట్ షూటింగ్ ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

 

 
కరోనా వైరస్ తగ్గగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ చిత్రానికి "వకీల్ సాబ్" అనే టైటిల్ ని చిత్ర యూనిట్ ఖరారు చేసారు. ఈ సినిమా తర్వాత కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడు. ఈ సినిమాని వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకి వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో పవన్ పాత్ర పై క్రిష్ కొత్త అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే క్రిష్ పవన్ కళ్యాణ్ పాత్ర అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులను హడావుడి చేస్తున్నారు ఈ క్రేజీ డైరెక్టర్.

 

 

అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి కూడా పెద్ద చర్చలు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ 27 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకి హీరోయిన్ గా సీనియర్ హీరోయిన్ స్వీటీ ని, అదేనండి అనుష్క ని ఖరారు చేసినట్టు సమాచారం తెలుస్తోంది. ఇంతకముందు క్రిష్ అనుష్క తో వేదం అనే సినిమా కలిసి పని చేసారు. ఆ సాన్నిహిత్యంతో క్రిష్ అడ‌గ‌టంతో మ‌రోసారి ఆయన సినిమాలో న‌టించ‌డానికి స్వీటీ ఓకే అన్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. ఏవి ఎన్ని అనుకున్న ఈ సినిమా మాత్రం కరోనా తగ్గిన తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: