టాలీవుడ్ లో తక్కువ సినిమాలే చేసినా ఎక్కువగా ఫ్యామిలీ ఫాన్స్ ని సంపాదించుకున్న నటి భూమిక చావ్లా. ఒకప్పుడు అగ్ర హీరోలు అందరితో ఆమె వరుసగా సినిమాలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ కి క్రమంగా దూరమై పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వరుసగా సినిమాలు చేయడానికి ఆమె సిద్దంగా ఉంది. ఆమె పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది. బాలకృష్ణ రూలర్ సినిమాలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంది. 

 

ఇక కథ డిమాండ్ చేస్తే తాను ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్దంగా ఉన్నా అని భూమిక ఇప్పటికే ఒక కీలక ప్రకటన కూడా చేసింది. అందుకే ఇప్పుడు దర్శకులు ఆమె కోసం కథలను రెడీ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు ఒకరు ఆమెకు కథ కూడా వినిపించారు అని సమాచారం. ఆ సినిమాలో ఆమె కాస్త బోల్డ్ గా నటించే సూచనలు ఉన్నాయని ఆ పాత్రలో ఆమె వేశ్యగా నటిస్తుంది అంటున్నారు. 

 

ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని త్వరలో దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తమిళ సినీ వర్గాలు కూడా అంటున్నాయి. అక్కడ ఈ సినిమాను విడుదల చేసేందుకు కూడా రెడీ చేస్తారట. ఈ సినిమా కోసం భూమిక భారీగా పారితోషికం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకోసం ఆమె దాదాపుగా కోటి రూపాయల వరకు వసూలు చేసే సూచనలు కనపడుతున్నాయి. హీరోయిన్ గా ఆమె ఎప్పుడు కూడా ఇంత తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటుంది అంటున్నాయి సినీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: