గడసరి అత్త సొగసరి కోడలు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, ఢీ లాంటి ప్రముఖ ప్రోగ్రాములలో వ్యాఖ్యాతగా బాధ్యతలు నిర్వహించి అశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇటీవల '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమా ద్వారా హీరో అవతారం ఎత్తాడు. విలేజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో కొనసాగనున్న ఈ సినిమా యొక్క ట్రైలర్, పాటలు యూట్యూబ్ లో పెద్ద సంచలనమే సృష్టించాయి. ఆయన హీరోగా నటించిన మొట్ట మొదటి సినిమాకే ఇంత విపరీతంగా ప్రజల ఆదరణ లభించడం గమనార్హం.


స్టార్ హీరోల కుమారుల తొలి సినిమాలకి కూడా ఇంత క్రేజ్ ఎవ్వరికీ వచ్చి ఉండదు. కానీ అమలాపురం అబ్బాయి ప్రదీప్ తన మంచి వ్యక్తిత్వం, వాక్చాతుర్యంతో సూపర్ డూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. దురదృష్టవశాత్తు ఆయన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా విడుదలయ్యే సమయంలోనే కరోనా వైరస్ మన దేశంలో అడుగుపెట్టింది. దాంతో తాను మొట్టమొదటిగా తీసిన సినిమా కాస్త వాయిదా పడింది. మార్చి 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్నా... లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల ఆలస్యం కావడంతో చాలామంది ప్రదీప్ అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందారని చెప్పుకోవచ్చు. ఎలాగో తన సినిమా ఇప్పుడు చూసే ఆస్కారం లేదని భావించిన అభిమానులు 'నీలి నీలి ఆకాశం' అనే పాటని ఈ లాక్ డౌన్ సమయంలో ప్రతిరోజు వింటునట్టున్నారు.


అందుకే లిరికల్ 'నీలి నీలి ఆకాశం' పాట, వీడియో రూపంలో రిలీజ్ అయిన ''నీలి నీలి ఆకాశం' పాటలు కలిపి ఏకంగా 10 కోట్ల వ్యూస్ ని సంపాదించాయి. ఒక కుర్ర హీరో పాటలకు పదికోట్ల వ్యూస్ వచ్చాయంటే అది మామూలు విషయం కాదు. ప్రస్తుత బడా స్టార్ సినిమా పాటలకే కోటి వ్యూస్ రావడం గగనమైంది. మరి అలాంటిది కేవలం ఓ టీవీ యాంకర్ అయిన ప్రదీప్ కి 10 కోట్ల వ్యూస్ రావడం నిజంగా ఆశ్చర్యకరమైన అరుదైన ఘనత అని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: