దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా భయం పట్టుకుంది. ఇప్పటి వరకు కరోనాకు ఎలాంటి విరుగుడు కనిపెట్టలేక పోయారు.  దీన్ని అరికట్టడం మన బాధ్యతే.. ఇంట్లో ఉంటూ కరోనాని నిర్మూలించాలని అంటున్నారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సూచించారు.  కరోనా వ్యాప్తి భారత దేశంలో మొదలైనప్పటి నుంచి సినీ, టివి సెలబ్రెటీలు ఎన్నో వీడియోలు సోషల్ మాద్యమాల ద్వారా తెలుపుతున్నారు. అయితే లాక్ డౌన్ ఉన్నప్పటికీ కొంత మంది ఆకతాయిలు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు.

 

అలాంటి వారికి స‌ల్మాన్ త‌న దైన శైలిలో జ‌వాబిచ్చాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమకేమీ కాదనే అలసత్వం వద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం భయపడితేనే మనుగడ సాగిస్తామని చెప్పారు.  వీడియోలో స‌ల్మాన్ త‌న మేన‌ల్లుడు నిర్వాన్( సోహైల్ ఖాన్ కుమారుడు)తో క‌లిసి మాట్లాడుతూ.. మేము కొద్ది రోజుల క్రితం ఇక్క‌డికి (ఫాం హౌజ్‌) వ‌చ్చాము. ఇక్క‌డే ఇరుక్కుపోయాం అని స‌ల్మాన్ వీడియోలో పేర్కొన్నారు.

 

 ఆయ‌న ఇంట్లో ఒంట‌రిగా ఉన్నాడు అని చెప్పారు. అలానే నిర్వాణ‌తో నీకు  ఈ  సినిమా డైలాగ్ గుర్తుందా, 'భయపడిన వ్యక్తి మరణిస్తాడు (‘ జో డ‌ర్ గయా వో మార్ గయా ’) అని చెబుతాడు. ఈ పరిస్థితిలో ఇది ఇక్కడ వర్తించదు. మేము భయపడ్డాము, ధైర్యంగా ఉన్నాము.  దయచేసి ఈ పరిస్థితిలో ధైర్యంగా ఉండకండి.. ఈ సమయం చాలా అపాయంగా భావించండి అన్నారు.  ఇక  ‘నేను కూడా మా నాన్నను చూసి మూడు వారాలైంది. మేం ఇక్కడ ఉంటే ఇంట్లో ఆయన ఒంటరిగా ఉన్నారు’ అని సల్మాన్ పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: