ప్రపంచమంతా కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ నటులు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అన్నారు. కరోనా నివారణ చర్యలకు తమ వంతు సాయంగా కృష్ణంరాజు కుటుంబం పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 10 లక్షల విరాళాన్ని అందజేసింది.  కరోనా వైరస్ భూతాన్ని ఎదుర్కోనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు భారీగానే అందుతున్నాయి.  దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందినవారు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తమ వంతు విరాళాలు అదిస్తున్న విషయం తెలిసిందే.

 

 ఈ నేపథ్యంలో నటుడు కృష్ణం రాజు తన వంతు సహాయంగా పది లక్షలు పీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు.   ఆయన కుటుంబ సభ్యులు కృష్ణంరాజు అర్ధాంగి శ్యామలాదేవి రూ.4 లక్షలు, పెద్దకుమార్తె సాయి ప్రసీద రూ.2 లక్షలు, రెండో కుమార్తె సాయి ప్రకీర్తి రూ.2 లక్షలు, మూడో అమ్మాయి సాయి ప్రదీప్తి రూ. 2 లక్షలు చొప్పున మొత్తం రూ.10 లక్షలు పీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. దీనిపై కృష్ణంరాజు స్పందిస్తూ, కరోనాపై పోరాటంలో తన కుటుంబం కూడా పాల్గొంటున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు.  

 

మా కుటుంబం నుంచి మా పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండో అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము దాచుకున్న పాకెట్ మనీ నుండి తలా రెండు లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని ముందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు కృష్ణం రాజు. కాగా,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతు సాయంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే రూ.4 కోట్లు విరాళంగా ఇచ్చారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: