ఇప్పుడు సినీ పరిశ్రమకు కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమ కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంది. పెట్టుబదులు పెట్టిన వేలాది మంది నిర్మాతలు ఇప్పుడు రోడ్డు మీద పడే పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది నిర్మాతలకు ఇప్పుడు నరకం కనపడుతుంది అంటున్నారు. బయటకు చెప్పుకోలేని స్థితిలో అగ్ర నిర్మాతలు కూడా ఉన్నారు. పెట్టుబడులు పెట్టిన వారు నరకం చూస్తున్నారట. 

 

అగ్ర హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువగా అడ్వాన్స్ లు  ఇచ్చారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ని సడలించినా సరే సినిమా నిర్మాణాలను మాత్రం కొనసాగించే అవకాశం లేదని అంటున్నారు. సినిమాలను విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వాలు లేవని అంటున్నారు. అలాగే కరోనా దెబ్బకు క్రికెట్ టోర్నీ లు కూడా నిర్వహించే ఆలోచనలో లేరు. ఇక సినిమాల పరిస్థితి అయితే మరీ దారుణమని అంటున్నారు. 

 

ఇప్పుడు అగ్ర హీరోలతో సినిమాలు చేసిన నిర్మాతలు వడ్డీలు పెరగడం తో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని టాక్. కొంత మంది నిర్మాతల మీద అప్పులు ఇచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని ప్రచారం జరుగుతుంది. హీరోలకు ఇచ్చిన అడ్వాన్స్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. మరి అది ఎంత వరకు నిజమో గాని కొందరు హీరోలు అయితే ముందుకి వచ్చి తామే తిరిగి ఇస్తున్నారట. చిన్న చిన్న నిర్మాతలకు ఆత్మహత్యల ఆలోచనలు వస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వాలు కూడా వారిని ఆదుకునే పరిస్థితి ఉండదు. మరి ఎం చేస్తారో ఎప్పుడు సినిమాలు మొదలవుతాయో...?

మరింత సమాచారం తెలుసుకోండి: