అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. వరుస అవకాశాలతో అందరు దర్శకులతో అతను సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ కూడా విజయ్ వైపు చూసింది. ఇప్పుడు విజయ్ చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. అయినా సరే దర్శకులు అతనితో సినిమాలు చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

 

ఫైటర్ అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా కోసం విజయ్ తనను తాను చాలా మార్చుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అక్కడ షాహిద్ కపూర్ తో కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు నిర్మాత బోనీ కపూర్ అని అంటున్నారు. బోని కపూర్ ఇప్పటికే కథను కూడా రెడీ చేయించారని అంటున్నారు. 

 

బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ సినిమాను చేసింది షాహిద్ కపూర్. అందుకే ఈ సినిమా కు ఇప్పుడు అక్కడ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా అక్కడ కూడా రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇది ఒక లవ్ స్టోరీ ఆధారంగా ఉంటుంది అంటున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. హీరోయిన్ గా కైరా అద్వాని నటిస్తుంది అనేది టాలీవుడ్ జనాల మాట. బాలీవుడ్ లో ఇప్పుడు ఈ సినిమా గురించి ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: