మెగా హీరో రామ్ చరణ్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే ఈ సినిమా టాలీవుడ్ లోనే కాదు రామ్ చరణ్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రతీ సీన్ కూడా చెక్కినట్టు ఎంతో జాగ్రత్తగా చూపించారు. 

 

ఇప్పుడు ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడనే టాక్ వినపడుతుంది. అయితే సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తోనే చేసే అవకాశం ఉందని సమాచారం. 

 

కథను కూడా సిద్దం చేసారని అంటున్నారు. అయితే మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండగా కాల్ బాయ్ గా రామ్ చరణ్ నటిస్తాడని టాలీవుడ్ టాక్. ఇప్పటికే కథ రామ్ చరణ్ విన్నాడని కథ నచ్చడం తోనే ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో చేస్తాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: