బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రేమాయణం సాగించి చివరకు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. వీరిద్ద‌రి ప్రేమాయ‌ణం ఎంత సంచ‌ల‌నం అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాలీవుడ్‌లో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాల‌తో అనుష్క దూసుకుపోతోన్న టైంలోనే టీం ఇండియా టాప్ క్రికెట‌ర్‌గా ఉన్న కోహ్లీతో ప్రేమాయ‌ణం న‌డిపి పెళ్లి చేసుకుంది. విచిత్రంగా ఇద్ద‌రూ కెరీర్ ప‌రంగా తిరుగులేని ఫామ్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే పెళ్లి చేసుకున్నారు.

 

పెళ్ల‌యినా కూడా అనుష్క సినిమాల్లో న‌టిస్తూనే ఉంది. అదే టైంలో అటు విరాట్ ఆట‌తో విజృంభిస్తున్నాడు. ఇప్పుడు ఈ జంట ఎక్క‌డ క‌న‌ప‌డినా పెద్ద సంచ‌ల‌న‌మే అవుతోంది. ఇక అనుష్క కొద్ది రోజులుగా సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. దీంతో ఆమె ఎందుకు సినిమాల్లో నటించట్లేదన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిని తొలుస్తోంది. అనుష్క ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అని.. ఆమె త్వ‌ర‌లోనే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తోందంటూ సోష‌ల్ మీడియాలో వార్తుల పుకార్లు షికార్లు చేయ‌డం ప్రారంభ‌మ‌య్యాయి. 

 

తాజాగా ఓ నెటిజ‌న్ ఈ ప్ర‌శ్న ఆమెను డైరెక్టుగా అడిగేశాడు. దీనికి ఆమె రిప్లే ఇస్తూ మా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేదు... ప్ర‌స్తుతం మంచి క‌థ‌లు రాక‌పోవ‌డంతోనే సినిమాలు చేయ‌ట్లేదు.. పిల్ల‌ల‌ను ఎప్పుడు క‌నాలో మాకు బాగా తెలుస‌ని స‌మాధానం ఇచ్చింది. ఇక గత ఏడాది కాలంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంది. షారుఖ్ ప‌క్క‌న ఆమె న‌టించిన జీరో అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి ఆమె మంచి క‌థ వ‌స్తేనే సినిమాలు చేస్తానంటూ చెపుతోంది. తాజాగా ఆమె ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఝుల‌న్ గోస్వామి బ‌యోపిక్‌లో న‌టిస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: