'నాపేరు సూర్య' లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత దాదాపు ఏడాదిన్నరకు పైగా ఏ సినిమా చేయలేదు బన్నీ. అటువంటి టైమ్ లో చాలా స్టోరీలు విన్న బన్నీ చివరాకరికి తానకి గతంలో రెండు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన ‘అలా వైకుంఠపురం లో’ సినిమా ఓకే చేసి ఈ ఏడాది సంక్రాంతి హిట్ కొట్టాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఏడాది రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకెల్లా బన్నీ నటించిన ‘అల వైకుంఠ పురం లో’ సినిమా అదిరిపోయే రికార్డులు సృష్టించింది. చాలా వరకూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది ‘అల వైకుంఠ పురంబులో’ సినిమా.  ఇదిలా ఉండగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపార రంగంలో కూడా వస్తున్నారు.

 

అంతేకాకుండా కొంత మంది అయితే సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమాలు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సరికొత్త వ్యాపారంలోకి అల్లు అర్జున్ అడుగు పెట్టబోతున్నట్లు ఇది ఇప్పటివరకు తెలుగు హీరోల్లో ఎవరికీ సాధ్యం కానీ తరహాలో ఆలోచించి సరికొత్త ట్రెండ్ సృష్టించే విధంగా బన్నీ బిజినెస్ చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే సినీ ఫీల్డ్ కి సంబంధించి దగ్గరగా ఉండే మ్యూజిక్ లేబుల్ ని స్టార్ట్ చేయాలని అల్లు అర్జున్ డిసైడ్ అయినట్టు సమాచారం.

 

ఇక ఇప్పటికే పలు మ్యూజిక్ లేబుల్ సంస్థలు మార్కెట్ లో మంచి బిజినెస్ చేస్తున్నాయి. ఒక పాట హిట్ అయితే ఆ కంపెనీకి లాభాలు వస్తాయి. దీంతో తన సినిమాలకు సంబంధించి చాలా ఆల్బమ్స్ ఆ విధంగానే సూపర్ డూపర్ హిట్ కావడంతో సదరు కంపెనీలు బాగా లాభాలు సాధించాయి. ముఖ్యంగా అలా వైకుంఠపురం లో సినిమా సాంగ్స్ అయితే అదిరిపోయే హిట్ అవటంతో సదరు మ్యూజిక్ లేబుల్ కంపెనీ రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మ్యూజిక్ లేబుల్ ని ప్రారంభించడానికి రెడీ అవుతున్నట్లు మంచి ప్లానింగ్ తో యంగ్ జనరేషన్  టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా అల్లు అర్జున్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: