ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న వారితో మూవీలు చేయ‌టానికి టాప్ హీరోలు సైతం ఆస‌క్తి చూపిస్తారు. ఆ విధంగానే బాలీవుడ్ బ్లాక్ బ్యాటీ దీపికాప‌దుకొనెతో న‌టించ‌టానికి బాలీవుడ్ టాప్ హీరోలు నో అని చెప్పలేక ఉండ‌రు. ఎందుకంటే దీపికా ప‌దుకొనెతో మూవీ చేస్తే, ఆ మూవీ అయిపోయే స‌మ‌యంలోనే హీరోతో ఎంత త్వర‌గా ఎఫైర్ పెట్టుకుంటుందో, అంత త్వర‌గానే బ్రేక్ అప్ కావ‌చ్చు. అందుకే దీపికా ప‌దుకొనెతో మూవీల‌ను చేయ‌టానికి బాలీవుడ్ హీరోలు తెగ‌ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా దీపికా ప‌దుకొనె, స‌ల్మాన్‌ఖాన్‌తో న‌టించాల‌ని కోరుకుంది. ఇప్పటి వ‌ర‌కూ ఈ బ్యూటి స‌ల్మాన్‌ఖాన్‌తో న‌టించ‌లేదు. అందుకే స‌ల్మాన్‌ఖాన్‌తో న‌టిస్తే త‌న కోరిక తీరుతుంద‌ని భావించింది. స‌ల్మాన్‌ఖాన్ సైతం ప్రస్తుతం త‌ను ఓ మూవీ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయ‌టానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మూవీలో హీరోయిన్‌గా దీపికాను తీసుకుందామ‌ని డైరెక్టర్ ప్రపోజ్ చేస్తే అందుకు స‌ల్మాన్ ఖాన్ నో అనేశాడు. ఈ న్యూస్‌ను తెలుసుకున్న దీపికా షాక్ అయ్యింద‌ట‌. దీనికి సంబంధించిన న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. స‌ల్మాన్ ఖాన్ ఎందుకు ఇలా అన్నాడో కార‌ణం తెలుసుకొని దీపికా తెగ బాధ‌ప‌డిపోయింది. స‌ల్మాన్ ఎందుకు నో చెప్పేశాడంటే 'బాలీవుడ్‌లో బిజిగా ఉన్న హీరోయిన్స్ నాకు అవ‌స‌రం లేదు, అయితే త‌న‌కు మూవీల కంటే హీరోల‌తో డేటింగ్‌లే ఎక్కువ' అని ఓ స‌న్నిహితుడికి చెప్పాడంట‌. దీపికాపై స‌ల్మాన్ చేసిన ఈ కామెంట్ బిటౌన్ లీకై, ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: