ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కెరియ‌ర్‌లో ఎక్క‌డా ఫ్లాప్ అనేదే లేదు ఎన్ని చిత్రాలు చేసినా అన్నీ హిట్టే. ఆయ‌న తీసిన బాహుబ‌లి గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వ‌రల్డ్ వైడ్ గా మంచి హిట్ కొట్టిన చిత్ర మిది. ఇక ఆ చిత్రం త‌ర్వాత అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం  రౌద్రం రణం రుధిరం. టాలీవుడ్ టాప్ స్టార్లు ఇద్ద‌రూ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.  రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి తెర‌మీద ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నున్నారు. అయితే ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్ర కోసం అజయ్ దేవగన్ నీ రాజమౌళి ఏరి కోరి మ‌రీ తీసుకున్నారు.

 

అయితే ఈగ చిత్రం కోసం అజయ్ దేవగన్ నీ రాజమౌళి సంప్రదించినట్లు తెలుస్తుంది. కాని ఈగ చిత్రాన్ని హిందీ లో చేయాలి అని అనుకున్నప్పుడు అజయ్ దేవగన్ మరియు కాజోల్ నీ కలిసిన విషయాన్ని రాజమౌళి తాజాగా వెల్లడించారు. అయితే హిందీ వెర్షన్ కి వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు వీరిద్దరూ ఒప్పుకున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే వీరు మళ్లీ ఎనిమిదేళ్ళ తర్వాత కలిసి పనిచేయడం పట్ల ఆయ‌న సంతోషం వ్యక్తం చేశారు.


అయితే రౌద్రం రణం రూధిరం చిత్రంలో అజయ్ దేవగన్ పాత్ర ఎంతో కీలకం అని ఆయన తెలిపారు. అయితే అజయ్ ని తీసుకోవడానికి గల కారణం రాజమౌళి తాజాగా వివరించారు. ముఖంలో,మ‌నం మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ అవసరం, అలానే సమగ్రత ఉండే నటుడు కోసం వెతికే ప్రయత్నం చేస్తున్నా, అంతేకాకుండా ఆ నటుడు మాటల్ని, ప్రవర్తన నీ అందరూ నమ్మేలా ఉండాలి అని ఆయ‌న‌ అన్నారు. అయితే ఇవి చెప్పి కొందరిని అడగగా పది మందిలో 9 మంది అజయ్ దేవగన్ పేరు చెప్పారు. అంటే దీన్ని బ‌ట్టే అర్ధం చేసుకోండి ఆయ‌న‌కు ఎంత క్రేజ్ ఉంది అన్న‌ది.  అయితే అజయ్ కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం సంతోషం, ఆయన ఎంతో అంకిత భావంతో పని చేశారని ఆయ‌న‌ అన్నారు. మ‌రి అజ‌య్‌దేవ‌గ‌న్ పాత్ర ఏంటి ఎలా ఉండ‌బోతుంది అన్న‌ది మాత్రం స‌స్పెన్స్ లో ఉంచాడు రాజ‌మౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: