చిత్ర పరిశ్రమలో దర్శక రత్న దాసరి నారాయణ రావుగారి తర్వాత మళ్ళీ అంత సూటిగా ఏ విషయం అయినా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. సామాజిక అంశం కాని, ఒక సినీ సెలబ్రిటీలకి సంబందించిన వ్యవహారలు కాని .. ఆయన స్పందించే పద్దతి ఒకేలా ఉంటుంది. నిజ నిజాలనే నమ్మి, వాస్తవం మాట్లాడే ధైర్యవంతుడు తమ్మా రెడ్డి. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి(94) సోమవారం మృతిచెందారు. 

 

ఈ విషయాన్ని తమ్మారెడ్డి భరద్వాజ స్వయంగా వెల్లడించారు. తన తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడ్డారని ఆరోగ్యం క్షీణించడం తో తుదిశ్వాస విడిచారని ప్రకటించారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి బారిన పడుతున్న కారణంగా ఎవరినీ రావద్దని వేడుకున్నారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా ప్రముఖ నిర్మాత. రవీంద్ర ఆర్ట్స్‌ పతాకంపై లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, డాక్టర్‌ బాబు వంటి సూపర్ హిట్‌ సినిమాలను నిర్మించారు. ఆ తమ్మారెడ్డి భరద్వాజ కూడా తండ్రి లాగానే సినిమాలని నిర్మించి, దర్శకత్వం వహించారు. ముఖ్యంగా చిరంజీవితో తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన కోతల రాయుడు మంచి హిట్ సినిమాగా నిలిచింది.

 

ఈ సినిమాతో చిరంజీవి, తమ్మారెడ్డి మధ్య ఏర్పడిన అనుబంధం ఇప్పటికి కొనసాగుతుంది. ఇక తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి మరణవార్త తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి తమ్మారెడ్డి గారిని ఫోన్‌లో పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపాన్ని తెలియజేశారు. సినిమా ఒక మజిలీ, సమ సమాజం నా అంతిమ లక్ష్యం అనే కృష్ణమూర్తి.. తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో సేవలదించారని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: