ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్నా సినిమా లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్ ఒకటి మంచి క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో చైతు, సాయి పల్లవిల జోడీ బాగా సెట్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో కూడా సాయి పల్లవి మీదనే శేఖర్ కమ్ముల ఎక్కువ కాన్సెంట్రేట్ చేశాడని అంటున్నారు. సాయి పల్లవి పాత్ర బాగా వస్తుందట. 

 

చైతు రోల్ కూడా బాగుంటుంది కానీ సాయి పల్లవి రోల్ ముందు అతని పాత్ర తేలిపోతుందని టాక్. ఫిదా సినిమాలో కూడా భానుమతి పాత్ర వల్లే సినిమా ఆడింది. వరుణ్ తేజ్ పాత్ర కొద్దిగా వీక్ అయినట్టు అనిపించింది. అయితే అది ఎలాగోలా హిట్ అయ్యింది. అయితే మళ్ళీ లవ్ స్టోరీ విషయంలో కూడా శేఖర్ కమ్ముల అదే రిపీట్ చేస్తున్నాడట. సాయి పల్లవి  కోసమే సినిమా చూసేలా లవ్ స్టోరీ ఉంటుందట. 

 

నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరి పెయిర్ బాగున్నా సినిమాలో చైతు పాత్ర కన్నా సాయి పల్లవి పాత్ర ఎక్కువ అలరిస్తుందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే శేఖర్ కమ్ముల నాగ చైతన్యకు అన్యాయం చేస్తున్నాడని చెప్పాలి. లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాల హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య లవ్ స్టోరీతో కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు. ఫిదా మ్యాజిక్ రిపీట్ చేసేలా శేఖర్ కమ్ముల ప్రయత్నం ఈసారి కూడా ఫలించేలా ఉంది. 

 

అక్కినేని హీరోల్లో ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న నాగ చైతన్యలవ్ స్టోరీతో కూడా సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు. సమ్మర్ టార్గెట్ తో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా లాక్ డౌన్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రిలీజ్ డేట్ కూడా మారుతుందని చెప్పొచ్చు. మొత్తానికి శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మరోసారి యూత్ ఆడియెన్స్ ను అలరించే ప్రయత్నంగా వస్తుంది. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: