ఒక్కసారి సినిమాల్లోకి హీరోయిన్ అడుగు పెడితే ఆమెకు వరుస అవకాశాలు అనేవి రావాలి. లేకపోతే మాత్రం కెరీర్ చాలా ఇబ్బంది పడుతుంది. చేసే సినిమాలు హిట్ అవ్వాలి. ఏ హీరో తో సినిమా చేసినా సరే ఆ సినిమా హిట్ అవ్వకపోతే మాత్రం హీరోయిన్ ని పట్టించుకునే అవకాశం దాదాపుగా ఉండదు. ఈ విషయం అందరికి తెలిసిందే. అందుకే హీరోయిన్ లు సినిమాలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. 

 

అయితే ఇప్పుడు అవకాశాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు కొందరు హీరోయిన్లు. ఈ నేపధ్యంలోనే ఒక హీరోయిన్ ఇప్పుడు యాంకర్ గా మారే ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఇలియానా... ఆమె వరుసగా సినిమాలు చెసింది ఒకప్పుడు టాలీవుడ్ లో. కాని ఇప్పుడు మాత్రం అవకాశాలు లేక ఆమె ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దీనితోనే ఆమె ఒక స్పోర్ట్స్ ఛానల్ లో యాంకర్ గా మారాలని చూస్తుంది. 

 

ఆ ఛానల్ యాజమాన్యం తో ఆమె ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తుంది. దీనికి యాజమాన్యం కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఆమె ఇప్పుడు ఒకటో రెండో సినిమాలు చేస్తుంది. ఈ సిమాలు పూర్తి అయితే ఆమె యాంకర్ గా పూర్తి స్థాయిలో వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమె కు మాత్రం సదరు ఛానల్ బాగానే ఆఫర్ చేసింది అంటున్నారు. ప్రస్తుతం ఈమె రవి తేజా తో ఒక సినిమా చేస్తుంది. బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: