బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన అభిప్రాయాలతో పాటు సోషల్ మీడియాలో తనకు ఇంట్రస్టింగ్ గా అనిపించిన అంశాలను కూడా షేర్ చేస్తుంటాడు అమితాబ్‌. అయితే అప్పుడప్పుడూ అవి మిస్‌ ఫైర్‌ అవుతుంటాయి. గతంలోనూ కొన్ని ఫేక్‌ పోస్ట్‌లను షేర్ చేసిన అమితాబ్ విమర్శలను ఎదుర్కొన్నాడు. తాజాగా మరోసారి అదే పోరపాటు చేశాడు.

 

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ఆదివారం అందరినీ దీపాలు వెలిగించాల్సిందిగా పిలుపు నిచ్చారు. ఆ పిలుపుకు దేశ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రతీ ఒక్కరు తమ వంతుగా దీపాలు వెలిగించి మేమంతా ఒక్కటే అని చాటి చెప్పారు. ఈ నేపధ్యంలో అమితాబ్ షేర్ చేసిన ఓ పోస్ట్ విమర్శలకు కారణమైంది.

 

ప్రపంచమంతా చీకట్లు అలుముకున్న సమయంలో మన దేశం మాత్రమే తెలుగుతున్నట్టుగా ఉన్న ఓ ఫోటోనూ ఓ వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేయగా దాన్ని అమితాబ్‌ షేర్ చేశారు. అయితే అలాంటి ఫేక్‌ ఫోటోను షేర్ చేయటంపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. బాధ్యతగా ఉండాల్సిన సెలబ్రిటీలు ఇలా ఫేక్‌ న్యూస్‌ షేర్ చేయటం ఏంటీ అంటూ విమర్శించారు.

 

గతంలో మోడీ జనతా కర్ఫ్యూ ప్రకటించిన సమయంలోనూ సెలబ్రిటీలకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. వైరస్ ఆయువు 24 గంటలు మాత్రమే అని.. ప్రజలు 24 గంటల పాటు బయటకు వెళ్లకపోతే వైరస్ చచ్చిపోతుందని ట్వీట్ చేశారు పవన్‌ కళ్యాన్‌, రజనీకాంత్ అయితే అది ఫేక్‌ న్యూస్‌ అంటూ ఆ న్యూస్‌ను తొలగించింది ట్విటర్‌ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: