పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడని చెప్పగానే ఆయన అభిమానులు ఉప్పొంగిపోయారు. అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ ని మళ్ళీ సినిమాల్లో చూడాలని అనుకున్న వారి కోరిక నిజమవుతున్నందుకు చాలా సంతోషించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ సంతోషాన్ని డబుల్ చేస్తూ ఒక్కటి కాదు ఏకంగా మూడు సినిమాలని ప్రకటించాడు.

 

ఎమ్ సీ ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ రీమేక్ ని తెలుగులో వకీల్ సాబ్ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. అటు వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొంటూనే క్రిష్ సినిమాలో కూడా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఒకేసారి తెరకెక్కుతున్నాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పవన్ బందిపోటు దొంగగా కనిపిస్తున్నాడు. 

 

అయితే ఈ రెండు చిత్రాలకి అభిమానుల నుండి ఎలాంటి రిక్వెస్టులు రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న మూడవ చిత్రం గురించి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తుంది గబ్బర్ సింగ్ డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ కాబట్టి. అప్పటి వరకు వరుసగా ఫ్లాపులే చూసిన అభిమానులకి ఒక్కసారిగా హిట్ అంటే ఎలా ఉంటుందో చూపించాడు హరీష్. 

 

అభిమానులు ఏ విధంగా తమ హీరోని చూడాలని అనుకుంటున్నారో ఆ విధంగా చూపించి శభాష్ అనిపించుకున్నాడు. స్వతాహాగా హరీష్ కూడా పవన్ అభిమాని కాబట్టి ఇది సాధ్యమై ఉండవచ్చు. ఇప్పుడు మళ్లీ పవన్ ని డైరక్ట్ చేయబోతుండడంతో అభిమానులు ఒక్కటే కోరుకుంటున్నారు. గబ్బర్ సింగ్ ని చూసి మేమెలా ఫీల్ అయ్యామో మళ్లీ అలాంటి పాత్ర కావాలి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: