బాహుబలి ఘనవిజయం తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ . టాలీవుడ్ స్టార్ హీరొలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. ఆ లుక్ తో ఎన్నో ప్రశ్నలని రేకెత్తించాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయట.

 

ఇదిలా ఉండగా ఆర్.ఆర్.ఆర్ గురించి మరో వార్త బయటకి వచ్చింది. అదేంటంటే మళయాల నటుడైన మోహన్ లాల్ కూడా ఆర్.ఆర్.ఆర్ లో ఓ పాత్ర చేయనున్నాడట. అధికారికంగా ఈ వార్త గురించి ఎలాంటి సమాచారం లేనప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోండి. కొమరంభీమ్ నటిస్తున్న ఎన్టీఆర్ కి బాబాయ్ గా మోహన్ లాల్ పాత్ర ఉంటుందని సమాచారం. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ కి పెదనాన్నగా నటించిన మోహన్ లాల్ ఆర్.ఆర్.ఆర్ లో బాబాయ్ గా కనిపిస్తున్నాడట.

 

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ లో స్టార్ క్యాస్టింగ్ పెరిగిపోతుంది. బాలీవుడ్ నుండి అజయ్ దేవగణ్, ఆలియా భట్ ఉండగా, ఇంకా కొన్ని ప్రధాన పాత్రల్లో మంచి పేరున్న నటులనే తీసుకొన్నారట. ప్రతినాయకులుగా అవసరాన్ని బట్టి హాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకున్న రాజమౌళి మిగతా పాత్రలకి ఇక్కడి వారినే ప్రిఫర్ చేసాడు. మరి మోహన్ లాల్ ఇందులో నటిస్తున్నాడనే విషయాన్ని ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: