సూపర్ స్టార్ మహేష్ అంటే  ఒక మంచి యాక్టర్ గా చాలా మంచి పేరు ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో. మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి సందేశం  తెలియజేస్తుంది అందరికీ.  చిన్న వయసులో నుంచే సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పటివరకు మంచి విజయాలు అందుకున్నారు మహేష్.  రాజకుమారుడు సినిమా నుంచి సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు తనకంటూ ఒక ప్రత్యేకతను తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ఏర్పరచుకున్నాడు. 

 

IHG

 

తండ్రిలాగే సూపర్ స్టార్ కృష్ణ లాగా సూపర్ స్టార్ మహేష్ బాబుగా ఎదిగాడు. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు రాజ కుమారుడి లాగా అందరి మనసులు దోచే చేసుకున్నాడు.   మహేష్ బాబు వ్యక్తిత్వాన్ని సినిమా ద్వారా మాత్రమే కాకుండా సామాజిక సేవ ద్వారా కూడా నిరూపించుకోవడం జరిగింది. ముఖ్యంగా రెండు ఊర్లను దత్త గా తీసుకొని వారి బాగోగులను చూడడంలో అయినా విజయం సాధించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే మహేష్ బాబు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం పరిపాటి. ఏదైనా విపత్తు జరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సహాయం చేయడంలో మహేష్ బాబు ముందుంటాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫ్యామిలీకి కూడా  ప్రాధాన్యం ఇస్తాడు.

 

IHG's family tree: Brother Ramesh Babu, sister Padmavathi ...


ఇక మహేష్ బాబు కుటుంబం విషయానికి వస్తే.. ఆయన తన భార్య నమ్రతనీ  ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ గౌతమ్, సితార బిడ్డలు ఉన్నారు. మహేష్ బాబుకి  కూతురు సితార  అంటే చాల ఇష్టం.  ముఖ్యంగా సితార  చేసే డాన్స్ అంటే చాల ఇష్టం. ఏది ఏమైనా మహేష్ బాబు సామాజిక కార్యక్రమాలలో ముందు ఉండి సహాయం చేస్తారు ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు మన హెరాల్డ్ విజేత మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: